బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటుల్లో వరుణ్ ధావన్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో హిందీ సినిమా లలో నటించి వాటిలో కొన్ని సినిమా లతో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని హిందీ సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ యువ నటుడు "బేడియా" అనే సినిమాలో హీరోగా నటించాడు. అమర్ కౌశిక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో వరుణ్ ధావన్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. సచిన్ జిగర్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

మంచి అంచనాలు నడుమ ఈ సినిమా 25 నవంబర్ 2022 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను  తెచ్చుకుంది. దానితో ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ మొత్తంలో కలెక్షన్ లు కూడా రాలేదు. చివరకు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ మూవీ గా మిగిలి పోయింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో కాస్త విఫలం అయిన ఈ సినిమా చాలా రోజుల తర్వాత "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను జియో సినిమాస్ సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ ని జియో సినిమాస్ సంస్థ వారు తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తుంది. ఈ మూవీ ని ఎవరైనా థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ సినిమా జియో సినిమాస్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: