
అయితే ఆమె రష్మిక కంటే బాగా చేస్తా అని అనలేదు. నేను చేసి ఉంటే బాగా చేసేదాన్ని నాకు ఆ క్యారెక్టర్ సూట్ అయ్యేది అని ఆమె చెప్పుకొచ్చింది. కానీ దీన్ని నెగెటివ్ గా తీసుకున్నారు. రష్మిక అభిమానులు తీవ్రంగా ఆమెని ట్రోలింగ్ చేస్తున్నారు. నేను చెప్పింది ఒకటి మీరు అర్థం చేసుకుంది మరోటి. నేను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. కేవలం పుష్ప లో ఆ క్యారెక్టర్ నాకు వస్తే బాగుంటుందని అన్నాను. అని వివరణ ఇచ్చింది. కానీ అభిమానులు ఇలా ట్రోల్ చేస్తారని అనుకోలేనని తెలిపింది.
దీనికి రష్మిక కూడా స్పందిస్తూ ఐ లవ్ యు ఐశ్వర్య ఇలాంటివి ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు నీ సినిమా ప్రమోషన్స్ లో మీ సినిమాలపై దృష్టి పెట్టు రాబోయే సినిమాలో మరింత విజయవంతం కావాలని కోరుకుంటున్నాను అని ఆమెకు విషెస్ చెప్పింది. రష్మిక స్పందించిన తీరుపై చాలామంది అభినందనలు తెలుపుతున్నారు. హుందాగా స్పందించడం కూడా హీరోయిన్లకు అవసరమని ఇలాంటి స్పందన రష్మిక గొప్పతనాన్ని తెలియజేస్తుందని ఎక్కువ మంది పొగుడుతున్నారు ఏదేమైనా ఐశ్వర్య చేసిన వ్యాఖ్యలు కించపరిచేవి కాకున్నా ఆమె వివాదంలో ఇరుక్కోవడం రష్మిక వచ్చి గొడవ సద్దుమణిగేలా చేయడం జరిగి పోయింది.