అల్లు అర్జున్ పుష్ప సినిమాతో మిగతా హీరోలను పక్కకు నెట్టి మరీ పాన్ ఇండియా స్టార్ డమ్ ను సంపాదించు కున్నాడు. పుష్ప సినిమాతో నార్త్ ప్రేక్షకులను కూడా తన వైపుకు తిప్పుకున్నాడు..

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప పార్ట్ 1 ఇప్పటికే విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ కాగా ఇప్పుడు రెండవ పార్ట్ కూడా తెరకెక్కుతుంది..పుష్ప ది రూల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుందటా.. ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ మరింత గ్రాండ్ గా నిర్మిస్తుండగా ఈ ఏడాది చివరిలో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.. ఇదిలా ఉండగా బన్నీ నెక్స్ట్ సినిమాను సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో అనౌన్స్ చేసాడు. మరి ఈ సెన్సేషనల్ కాంబో ఇంకా సెట్స్ మీదకు  అయితే వెళ్ళ లేదు .

పుష్ప 2 తర్వాత ఈ సినిమానే స్టార్ట్ చేస్తారు అని అంతా కూడా అనుకున్నారు కానీ బన్నీ ఈ లోపులోనే ఒక సినిమాను పూర్తి చేసి ఆ తర్వాత సందీప్ తో స్టార్ట్ చేయబోతున్నాడు అని  వస్తున్న వార్తల ప్రకారం అల్లు అర్జున్ తనకు హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో నెక్స్ట్ సినిమా చేసేందుకు కమిట్ అయ్యారని కూడా టాక్ వస్తుంది.

వీరి కాంబోలో నాలుగవ సినిమా అయితే తెరకెక్కబోతుంది అని సమాచారం.. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయి లో అదిరిపోయేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా స్టార్ డమ్ పెంచుకున్న అల్లు అర్జున్ ఆ తర్వాత తాను చేసే సినిమాలన్నీ కూడా నేషనల్ వైడ్ గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.. ఇప్పటికే మూడు వరుస విజయాలు అందుకున్న కాంబో కాబట్టి ఈ సినిమాపై ఆడియెన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రజెంట్ త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడటా.. ఈ సినిమా పూర్తి అయ్యేలోపు అల్లు అర్జున్ కూడా పుష్ప 2 పూర్తి చేయనున్నాడటా.. ఆ తర్వాత గ్యాప్ లేకుండా వీరి కాంబోలో సినిమా స్టార్ట్ అవుతుందట.. ఇప్పటికే త్రివిక్రమ్ అల్లు అర్జున్ కోసం కథ రెడీ చేసినట్టు సమాచారం.. పాన్ ఇండియా స్థాయి లో ఈసారి అసరగొట్టేలా మూవీ ని ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: