అక్కినేని అఖిల్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఎనిమిదేళ్లు దాటిపోతుంది. అయినా సరే తన సినీ కెరియర్లో ఇప్పటివరకు ఒక్క హిట్ సినిమా కూడా లేదు. ఇక ఆయన తర్వాత వచ్చిన హీరోలు చాలామంది ఇండస్ట్రీని షేక్ చేస్తుంటే అఖిల్ మాత్రం అక్కడే ఆగిపోయాడు. స్టార్ హీరో లక్షణాలు పుష్కలంగా ఉన్నప్పటికీ సరైన కథను ఎంపిక చేసుకోవడం  లేదు అఖిల్. సరైన స్క్రిప్ట్ సెలక్షన్ లేక కెరియర్ మొత్తాన్ని నాశనం చేసుకుంటున్నాడు. ఇటీవల భారీ అంచనాల నడుమ విడుదలైన ఏజెంట్ సినిమాతో భారీ డిజాస్టర్  అందుకున్నాడు అఖిల్. ఈ సినిమా కోసం అఖిల్ ఎంతగా కష్టపడ్డాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

ఈ సినిమాతో అయినా హిట్ కొడతాడని అనుకుంటే ఇంకా కిందకి వెళ్ళిపోయాడు. ఈసారైనా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కచ్చితంగా ప్లాన్ చేస్తున్నాడు అఖిల్. అయితే ఆయన చేయబోయే నెక్స్ట్ సినిమా పేరు ధీర .అఖిల్ చేయబోయే ఈ సినిమా మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తరికేకిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాకి పెట్టుబడిలో పార్టనర్ గా ఉన్నారు. ఇక ఈ సినిమాతో అనిల్ కుమార్ అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఈయన గతంలో ప్రభాస్ హీరోగా నటించిన సాహో  సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన

ఒక క్రేజీ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాలో అఖిల్ మాజీ వదిన సమంత కూడా నటించబోతున్నట్లు ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత కూడా అఖిల్ తో స్నేహంగానే ఉంటుంది సమంత. అందుకే సమంత ఈ సినిమాలో నటించిన ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది .అఖిల్ ఈ సినిమాలో చేయమని అడగగానే ఏ మాత్రం ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట సమంత. దీంతో ఈ వార్త బయటకు రావడంతో సమంత ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోందా లేదా ఏదైనా కీలక పాత్రలు నటిస్తుందా అన్నది మాత్రం తెలియదు ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: