తెలుగు లో స్టార్ కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రస్తుతం ఈయన రాజకీయాలలో కూడా కొనసాగుతూ ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా కూడా ఆయన పని చేస్తున్నారు.

ఇలా సినిమాలలోను రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఆలీ కుటుంబం తాజాగా ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లు అలీ భార్య జుబేదా తన యూట్యూబ్ ఛానల్ లో తెలియజేశారు.అసలు ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనే విషయాలన్నింటిని కూడా ఈమె ఈ వీడియో ద్వారా అయితే తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది.

ఇందులో భాగంగా జుబేదా అలీ పెద్ద కుమార్తె ఫాతిమా అమెరికా నుంచి తిరిగి రావడంతో గుంటూరు నుంచి కూడా ఫాతిమా అత్తమామలు వచ్చారని అందరం కలిసి సరదాగా బయటకు వెళ్లాలని ప్లాన్ చేసినట్టు ఆమె తెలియజేశారు. ఇలా అందరూ కలిసి ఎయిర్ పోర్ట్ కు కారులో వెళుతున్న సమయంలో ఈమె తాము ఎక్కడికి వెళ్తాము అనేది సస్పెన్స్ అంటూ అయితే చెప్పుకొచ్చారు. అయితే అందరూ విమానం లోకి ఎక్కిన తర్వాత విమానం టేక్ ఆఫ్ అవుతుండగా తన చిన్న కుమార్తె చాలా భయపడి పోయిందని జుబేదా చెప్పుకొచ్చారు. ఇలా సరదాగా మా ప్రయాణం మొదలైంది అనుకున్న కొంత సమయానికే విమానంలో ఒక అలర్ట్ అయితే వచ్చిందని జుబేదా తెలిపారు. బయట భారీ వర్షం కారణంగా విమానం ప్రమాదంలో ఉందని  వారు అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా అందరూ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకున్నామని క్షేమంగా కిందికి దిగుతామా లేదా అన్న భయం అందరిలో మొదలైందని ఈమె తెలిపారు.. ఇలా ఒక అరగంట పాటు అందరూ కంగారు పడుతూనే ఉన్నామని అనంతరం విమానం సేఫ్ గా ల్యాండ్ అవడంతో ఒక్కసారిగా మేము ఊపిరి పీల్చుకున్నామని ఈ సందర్భంగా జుబేదా వారికి తప్పిన పెను ప్రమాదం గురించి తెలియజేస్తూ ఒక వీడియోని అయితే షేర్ చేశారు.ఆ భగవంతుడి దయతోనే మేము ప్రమాదం నుంచి బయటపడ్డామని చెప్పిన ఈమె ఈ ప్రమాదం ఎప్పుడు జరిగిందనే విషయాన్ని మాత్రం అస్సలు చెప్పలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: