పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'బ్రో'. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచభట్ల నిర్మాతలుగా సముద్రఖని ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. తమిళంలో హిట్ అయిన వినోదయ సీతం అనే సినిమాకి ఇది తెలుగు అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇక రీమేక్ కి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిగా శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. 

దీంతో ఈ సినిమాకి భారీ స్థాయిలో బిజినెస్ కూడా జరుగుతోందట. తాజా సమాచారం ప్రకారం 'బ్రో' మూవీ బిజినెస్ ఆల్మోస్ట్ క్లోజ్  అయిందట. అంతేకాదు రిలీజ్ కి ముందే ఈ మూవీకి భారీ స్థాయిలో లాభాలు కూడా వచ్చాయని అంటున్నారు. ఈ సినిమాకి అందరి రెమ్యూనరేషన్స్ తో కలిపి 120 కోట్ల బడ్జెట్ పెట్టారట నిర్మాతలు. అయితే ఈ సినిమాకి థియేట్రికల్ మరియు నాన్ థియెట్రికల్ రైట్స్ కలిపి ఏకంగా 175 కోట్లకు అమ్ముడయ్యాయని ప్రచారం జరుగుతోంది. సాయిధరమ్ తేజ్ తో పాటు పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరో ఉండటం వల్లే ఈ సినిమాకి ఈ రేంజ్ లో బిజినెస్ జరిగిందని అంటున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపిస్తుండగా..

 సాయి ధరం తేజ్ యాక్సిడెంట్ లో చనిపోయి మళ్లీ బ్రతికే వరం పొందిన వ్యక్తిగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రనిడివి కేవలం 20 నిమిషాల పాటు ఉండబోతుందట. అయినా కూడా పవర్ స్టార్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ మూవీపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేల ఓ ఐటెం సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. నిజానికి ముందుగా ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం రకుల్ ప్రీత్ సింగ్ ని మూవీ టీమ్ సంప్రదించగా.. ఆమె ఐటమ్ సాంగ్ చేయడానికి నో చెప్పినట్లుగా తెలుస్తోంది. దాంతో ఆమె స్థానంలో తాజాగా ఊర్వశి రౌతేల ను తీసుకున్నట్లు సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: