ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుండి అనేక సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు భారీ కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేశాయి. అలా ఇప్పటి వరకు ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాలలో హైయెస్ట్ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.

పఠాన్ : షారుక్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్ గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ హిందీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1050 కోట్ల గ్రాస్ కలక్షన్ లను వసూలు చేసి ఈ సంవత్సరం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుండి విడుదల అయిన సినిమాలలో అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన సినిమాల్లో టాప్ స్థానంలో నిలిచింది.

పోన్నియన్ సెల్వన్ 2 : మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి ప్రపంచ వ్యాప్తంగా 330 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

వారిసు : దళపతి విజయ్ హీరో గా రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది.

ది కేరళ స్టోరీ : ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 290 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.

వాల్టేర్ వీరయ్య : మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 235 కోట్ల గ్రాస్ కలక్షన్ లను వసులు చేసి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ లో రవితేజ ఒక కీలక పాత్రలో నటించగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: