అప్పుడప్పుడు సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటుల మధ్య జరిగిన కమ్యూనికేషన్స్ బాగా వైరల్ అవుతూ ఉంటాయి. మామూలుగా నటీనటులు తమ సినిమాల సమయంలో ఉన్న పరిచయాల వల్ల బాగా క్లోజ్ గా ఉంటారు.అలా వాళ్లు కలిసినప్పుడల్లా సరదాగా మాట్లాడుతూ కనిపిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు సరదాగా కామెంట్లు చేస్తూ ఉంటారు. అయితే తాజాగా సాయి ధరమ్ తేజ్ రాశిఖన్నాకు ఒక మెసేజ్ పెట్టడంతో వెంటనే నెటిజెన్స్ రకరకాలుగా ఆడుకుంటున్నారని. ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం.టాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ రాశి ఖన్నా పరిచయం గురించి పరిచయం గురించి అందరికీ తెలిసిందే. అతి తక్కువ సమయంలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా వరుస ఆఫర్ లతో బిజీ గా మారింది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

బాలీవుడ్ సినిమాతో తొలిసారి సినీ ఇండస్ట్రీకి పరిచయమైన రాశి ఖన్నా ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో కూడా అడుగు పెట్టింది. మొదట అతిధి పాత్రలో మెప్పించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుసగా హీరోయిన్ అవకాశాలను సొంతం చేసుకుంది.ఒకప్పుడు బొద్దుగా ఉండే రాశిఖన్నా ఇప్పుడు మొత్తానికి సన్నబడి బాగా ఫోటో షూట్ లు చేయించుకుంటుంది.ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో తను తీయించుకున్న ఫోటోషూట్లని వెంటనే పంచుకుంటూ ఉంటుంది. ఒకప్పుడు వరుసగా సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు అవకాశాలు తక్కువగా రావటంతో చాలా గ్యాప్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం గ్యాప్ లేకుండా ఫోటోలు షేర్ చేస్తూ వారికి బాగా దగ్గర్లో ఉందని చెప్పాలి.

అప్పుడప్పుడు తన సినిమా అప్డేట్ల గురించి కూడా పంచుకుంటూ ఉంటుంది. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను కొన్ని ఫోటోలు తన ఇన్స్టా వేదికగా పంచుకుంది. అందులో తను ఒక రెస్టారెంట్ లో ఫుడ్ ని తింటే ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించింది. ఆ ఫోటోలు షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే బాగా వైరల్ అయ్యాయి. ఇక ఆ ఫోటోలను హీరో సాయి ధరమ్ తేజ్ కూడా చూసి వెంటనే ఇలా అడిగేసాడు. ఇప్పటికీ నా దగ్గర ఫోటోగ్రాఫర్స్ నెంబర్ లేదు అంటూ కామెంట్ చేయగా వెంటనే నెటిజన్స్.. నెంబర్ తీసుకొని ఏం చేస్తావ్ అన్న అంటూ ప్రశ్నించగా.. మరికొంతమంది.. తీసింది మీరే కదా అన్న.. పెళ్లి ఎప్పుడు మరి అని ప్రశ్నిస్తున్నారు. అలా వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అని ప్రశ్నల మీద ప్రశ్నలు రావడంతో.. అన్న పొరపాటున కామెంట్ పెట్టేసావ్ అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో పలు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. అలా ఆ సమయంలో వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: