టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున భార్య అక్కినేని అమల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా మొదట పరిచయమైన ఈమె ఆ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీకి శివ అనే సినిమాతో పరిచయమైంది.ఇక ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా నటించింది ఈమె.వీరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ ట్రెండ్ సెట్టర్గా నిలిచింది అని చెప్పాలి. అలా వీరిద్దరూ ఒకటి రెండు సినిమాల్లో కలిసి నటించిన తర్వాత ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొంతకాలానికి వీరిద్దరూ వివాహం కూడా చేసుకోవడం జరిగింది. వీరిద్దరికీ అఖిల్ అనే కొడుకు సైతం జన్మించాడు. 

ప్రస్తుతం అఖిల్ కూడా సినీ ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నారు. హీరోగా రాణిస్తున్నప్పటికీ స్టార్ హీరోగా మంచి గుర్తింపును మాత్రం తెచ్చుకోలేకపోయాడు అఖిల్.అయినా సరే ఎప్పటికైనా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా నిలదొక్కుకోవాలి అన్న ప్రయత్నాలను మాత్రం ఆపడం లేదు. ఇటీవల ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ గా మిగిలాడు అఖిల్. అప్పట్లో కొందరు స్టార్ హీరోలతో కలిసి నటించిన అమలా బ్యాక్ గ్రౌండ్ గురించి చాలామందికి తెలియదు. అయితే సౌత్ ని ఇండస్ట్రీలో సినిమాల్లో ఈమె ఎక్కువగా నటించారు.

 కాబట్టి సౌత్ కి చెందిన అమ్మాయి అని  అనుకుంటారు. నిజానికి ఈమె తండ్రి వెస్ట్ బెంగాలీ .అక్కడే నేవీలో పనిచేసేవారట .అలా సౌత్ లోపల భాషలలో పలు చోట్లకు రావాల్సి వచ్చిందిట. ఇక ఆమె తల్లి ఐర్లాండ్ కు చెందిన మహిళ. ఈమె తల్లిదండ్రులు కూడా ప్రేమించి వివాహం చేసుకున్నారు. అనంతరం ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖ నేవీలో అమల తండ్రి కొంత కాలం పని చేశారు. కాగా తన తల్లికి సంబంధించిన బంధువులు అందరూ కూడా ఐర్లాండ్ లోనే ఉంటారట. ఇక నిర్ణయం సినిమా తర్వాత నాగార్జునను వివాహం చేసుకుంది అమల. పెళ్లి తర్వాత హీరోయిన్గా ఆగ్రహం అనే సినిమాలో నటించిన ఈమె తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ కొనసాగుతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: