టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం మంచి జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న యువ నటుల్లో సుహాస్ ఒకరు. ఈ నటుడు కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. అలా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న సమయంలో ఈ నటుడు కలర్ ఫోటో అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో చాందిని చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. అలాగే ఈ సినిమాలో హీరో ... హీరోయిన్ లుగా నటించిన సుహాస్ ... చాందిని చౌదరి ల నటనలకు కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.

మూవీ తో ఒక్క సారిగా సుహాస్ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పెరిగి పోయింది. దానితో వరుసగా ఈ నటుడికి తెలుగు సినిమాల్లో హీరో అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా కొంత కాలం క్రితమే ఈ యువ నటుడు రైటర్ పద్మభూషణ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. షణ్ముఖ ప్రశాంత్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా యొక్క సాటిలైట్ హక్కులను జీ సంస దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితమే జీ తెలుగు ఛానల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేశారు. అందులో భాగంగా ఈ మూవీ కి మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 2.57 "టి ఆర్ పి" రేటింగ్ దక్కింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమాకు బుల్లి తెరపై మొదటి సారి ప్రసారం అయినప్పుడు మంచి "టి ఆర్ పి"  రేటింగ్ దక్కింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: