తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటు వంటి నాగ శౌర్య తాజాగా ఫలానా అబ్బాయి పలానా అమ్మాయి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించగా ... మాళవిక నాయర్ ఈ సినిమాలో నాగ శౌర్య సరసన హీరోయిన్ గా నటించింది. ఇది వరకే నాగ శౌర్య అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో ఊహలు గుసగుసలాడే ... జ్యొ అచ్యుతానంద అనే రెండు మూవీ లు రూపొంది ఆ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించడంతో విరి కాంబినేషన్ లో రూపొందిన మూడవ మూవీ అయినటువంటి ఫలానా అబ్బాయి పలానా అమ్మాయి మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమా భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టడంలో విఫలం అయ్యింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ ను అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరిచిన ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది.

మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జెమినీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు జెమినీ టీవీ లో ప్రసారం చేయనున్నట్లు జెమినీ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు అల్లరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: