నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఎప్పుడు అనే ప్రశ్న నందమూరి అభిమానులకు భేతాళ ప్రశ్నలా మిగిలిపోయింది. ఒకనొక సమయం లో మోక్షజ్ఞ కు సినిమాల పై ఆసక్తి లేదని సినిమా ల్లోకి ఎంట్రీ ఇవ్వబోరని కామెంట్లు వ్యక్తమయ్యాయి.అయితే బాలయ్య మాత్రం త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ అని చెబుతూ వచ్చారు. అయితే మోక్షజ్ఞ లుక్ ను చూసిన అభిమానులు మాత్రం మోక్షజ్ఞ బరువు తగ్గకపోతే హీరో గా ఎంట్రీ ఇచ్చినా ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేరని అభిప్రాయం వ్యక్తం చేశారు.

లుక్స్ విషయం లో మోక్షజ్ఞ విమర్శలను ఎదుర్కో గా బాలయ్య పుట్టిన రోజు సందర్భం గా బయటకు వచ్చిన మోక్షజ్ఞ లుక్ మాత్రం ఫ్యాన్స్ ను సంతోషాని కి గురి చేసింది. స్లిమ్ లుక్ లో మోక్షజ్ఞ సింహంలా ఉన్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమయ్యాయి. అయితే మోక్షజ్ఞ తక్కువ సమయం లో బరువు ఎలా తగ్గాడనే ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆర్ లా సర్జరీ చేయించుకున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాఖీ సినిమా తర్వాత తారక్ సర్జరీ చేయించుకోగా మోక్షజ్ఞ మాత్రం నెగిటివ్ కామెంట్లకు తావివ్వకుండా బరువు తగ్గి కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. అదుర్స్ అనే విధంగా మోక్షజ్ఞ లుక్ ఉందని కొంతమంది నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య డైరెక్షన్ లోనే మోక్షజ్ఞ తొలి సినిమా సినిమా తెరకెక్కనుందనీ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మోక్షజ్ఞ లుక్ గురించి పాజిటివ్ కామెంట్లు వినిపించ గా బాలయ్య సపోర్ట్ తో మోక్షజ్ఞ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడం కష్టం కాదని కామెంట్లు వ్యక్తమయ్యాయి. మోక్షజ్ఞ తొలి సినిమా ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్ తో తెరకెక్కనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మోక్షజ్ఞ తొలి సినిమా తోనే సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కెరీర్ పరంగా మోక్షజ్ఞ సక్సెస్ సాధించాలని సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: