సాధారణంగా హీరోయిన్లు సైతం ఈ ప్రశ్నకు జవాబు చెప్పడానికి ఇష్టపడరు. అయితే కొన్నేళ్ల క్రితం జరిగిన ఒక ఘటన ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం అభిమానులకు దొరికేసింది. యూపీలోని అయోధ్య కాన్యకుబ్జ బ్రాహ్మణ కుటుంబం లో లావణ్య జన్మించారు. ఒక సందర్భంలో బ్రాహ్మణులను ప్రశంసిస్తూ ఒకరు కామెంట్ చేయగా ఆ సమయం లో లావణ్య ఘాటుగా స్పందించడం వల్ల ఆమె కులం అప్పట్లో వైరల్ అయింది.
సొంత కులానికి చెందిన వాళ్ల నుంచే విమర్శలు రావడం తో ఈ వివాదం విషయం లో లావణ్య త్రిపాఠి సైలెంట్ అయ్యారు. కులం తో సంబంధం లేకుండా ప్రేమ వివాహానికి ఓకే చెప్పిన మెగా ఫ్యామిలీని సైతం నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. మరోవైపు వరుణ్ లావణ్య వివాహం గ్రాండ్ గా ఇటలీలో జరగనుందని సమాచారం. టాలీవుడ్ సెలబ్రిటీలను రిసెప్షన్ కు ఆహ్వానించనున్నారని తెలుస్తోంది.
రాబోయే రోజుల్లో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి తమ ప్రేమ, పెళ్లికి సంబంధించి మరిన్ని విషయాలను వెల్లడించే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి తర్వాత కలకాలం అన్యోన్యంగా ఉండాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి ని అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. మెగా కోడలిగా లావణ్య త్రిపాఠి పర్ఫెక్ట్ ఛాయిస్ అని కొంతమంది సోషల్ మీడియా వేదికగా చేస్తున్న కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి