కోలీవుడ్‌లో స్టార్ హీరో విజయ్ దళపతికి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విజయ్‌ ఇక పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారని, ఆయన సినిమాలకు గుడ్‌ బై చెప్పబోతున్నారనే వార్త వినిపిస్తుంది.విజయ్‌ 2026 ఎలక్షన్లే టార్గెట్‌గా ముందుకు సాగుతున్నారని సమాచారం. ప్రస్తుతం విజయ్ "లియో" మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత దర్శకుడు వెంకట్ ప్రభు తో ఇంకో సినిమా చేస్తున్నట్టుగా కూడా అనౌన్స్ చేశారు. తన కెరీర్ లో ఇదే లాస్ట్ సినిమా అనే టాక్ వైరల్ గా మారింది.

విజయ్‌ శనివారం చెన్నైలో పెద్ద ఈవెంట్‌ నిర్వహించారు. పదో తరగతి, ఇంటర్ లో టాపర్స్ ని అభినందించారు. పతి ఒక్క టాపర్‌కి రూ. 5వేల చెప్పున ఆయన ఏకంగా 70లక్షల ప్రైజ్‌మనీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయాలకు సంబంధించిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిల్లలంతా.. డబ్బు తీసుకోకుండా ఓట్లు వేయాలని పేరెంట్స్ కి చెప్పాలని, అంబేద్కర్‌, పేరియార్‌ వంటి గొప్ప వారి గురించి తెలుసుకోవాలని వెల్లడించారు. డబ్బు తీసుకుని ఓటు వేసే పద్ధతిని మార్చాలని పిలుపునిచ్చారు. డబ్బు తీసుకుని ఓటు వేస్తే మన వేలితో మన కంటినే పొడుచుకున్నట్టు అవుతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో చర్చనీయాంశమయ్యాయి.

అయితే విజయ్‌ ఈ వ్యాఖ్యలు ఆయన రాజకీయాల్లోకి వెళ్లడమనే విషయాన్ని కన్ఫామ్‌ చేస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు. ముందస్తు ప్లాన్‌తోనే విజయ్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం టెన్త్, ఇంటర్‌ పూర్తయిన వాళ్లు వచ్చే ఎన్నికలకు ఓటు హక్కుకి అర్హులవుతారు. ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా వారందరిని తనకి అనుకూలంగా మార్చుకునేందుకు వీలవుతుందని, ఆ సమయంలో ఇప్పటి విద్యార్థులంతా తనకు ప్రయారిటీ ఇస్తారనే ఉద్దేశ్యంతోనే విజయ్‌ ఈ కార్యక్రమం చేపట్టినట్టు టాక్‌. ఇక విజయ్ లానే మరో స్టార్ హీరో సూర్య కూడా రాజకీయాల్లోకి వస్తున్నాడు..? అంటూ కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. నిన్న పబ్లిక్ గా విద్యార్థులను విజయ్ ప్రశంసిస్తే.. సూర్య ప్రైవేట్ గా వాళ్ళని కలిసి ప్రశంసించాడు. తాజాగా అగారం ఫౌండేషన్ లో సూర్య విద్యార్థులను కలిసి మాట్లాడాడు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: