ఇక బాలయ్య గతంలో స్పీడ్ గా సినిమాలు చేసినా కూడా ఈ మధ్య కాలంలో మాత్రం సినిమాల సంఖ్య తగ్గించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు బాలయ్య కొత్త సినిమా షూటింగ్ అప్డేట్ ఇవ్వలేదు. భగవంత్ కేసరి సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో బాలయ్య సినిమా ఉంటుందని కన్ఫర్మ్ అయింది.కానీ ఆ విషయంలో ఫ్యాన్స్ ను ఉత్సాహ పరిచే వార్త ఒకటి కూడా రావడం లేదు.మొత్తానికి బాలయ్య ఫ్యాన్స్ కి నిరాశ మిగుల్చుతున్నారు. ఇక కళ్యాణ్ రామ్ సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో.. ఎప్పుడు పోతున్నాయో క్లారిటీ లేదు. ఆయన నుండి వరుసగా సినిమాలు వస్తాయని అప్పుడప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి.కానీ ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ కొత్త సినిమా అప్డేట్ రావడం లేదు. రెండు సినిమా లు లైన్ లో పెట్టిన ఈ నందమూరి హీరో ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ను మాత్రం చెప్పడం లేదు. మొత్తానికి ఈ మధ్య నందమూరి అభిమానులకు వరుసగా నిరాశే మిగులుతోంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి