నందమూరి బాలకృష్ణ.. ఫుల్ జోష్ మీద ఉన్న సంగతి తెలిసిందే. ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.ఈ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ మూవీ చేయాల్సి ఉంది. అయితే ఈ మూవీ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. బాలయ్య.. ఏకంగా బాబీకి షాక్ ఇచ్చాడని సమాచారం. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.కరోనా టైం నుంచి బాలయ్యకు కలిసివస్తోందని చెప్పవచ్చు. థియేటర్లకు జనాలు వస్తారా రారా అంటూ దర్శకనిర్మాతలు సినిమాలు రిలీజ్ చేసేందుకు భయపడుతుంటే.. ఒక్క బాలయ్య మాత్రం.. అఖండ అనే సినిమాతో వచ్చి అదరగొట్టాడు. ఏకంగా వందకోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాడు. ఇక అలా చిత్ర పరిశ్రమకు దైర్యాన్ని ఇచ్చిన బాలయ్య.. ఆ తర్వాత అన్ స్టాపపబుల్ షోతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఇక ఈ షో సక్సెస్ కావడంతో.. రెండో సీజన్ కూడా ప్లాన్ చేయగా.. అది కూడా సూపర్ హిట్టుగా నిలిచింది.

ఇక ఈ ఏడాది ప్రారంభంలో బాలయ్య.. వీరసింహారెడ్డి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. చిరు వాల్తేరు వీరయ్యకు పోటీగా.. వీర సింహారెడ్డి కలెక్షన్లు వసూలు చేసింది. ఇక బాలయ్య హ్యాట్రిక్ పై కన్నేశాడు. అందుకే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య భగవంత్ కేసరి అనే చేస్తున్నారు.భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య సరసన కాజల్ ఆగర్వాల్ నటిస్తుండగా.. శ్రీలీల కూతురి పాత్రలో నటిస్తుందని ప్రచారం సాగుతోంది. ఇక ఇప్పటికే రిలిజ్ చేసిన టీజర్, పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ మూవీ దసరా కానుకగా.. అక్టోబర్ 17న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇక ఈ మూవీ హిట్ అయితే బాలయ్య హ్యాట్రిక్ కొడతాడు. ఇక ఈమూవీలో బాలయ్యను మునుపెన్నడూ చూడని పాత్రలో చూడనున్నమని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ యాసలో బాలయ్య చెప్పిన డైలాగ్స్ అదుర్స్ అనిపించాయి.

మూవీ తర్వాత బాబీ దర్శకత్వంలో బాలయ్యసినిమా చేయనున్నట్లు ప్రకటించారు. ఆయన బర్త్ డే సందర్భంగా ఈ మూవీ లాంఛనంగా ప్రారంభం అయింది. అయితే ఈ మూవీ పిరియాడిక్ కథతో తెరకెక్కనుందని ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ ఆధారంగా తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ స్టోరీ బాలయ్యకు నచ్చలేదట. దీనితో ఈ మూవీ క్యాన్సిల్ అయిందనే న్యూస్ వినిపిస్తోంది. ఇందులో ఎంత నిజం ఉంది అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు తెలియదు.ఇక ప్రస్తుతం బాలయ్య తన నెక్ట్స్ మూవీ కోసం కథ వెతుకుతున్నారని సమాచారం. బాబీ దర్శకత్వంలో ఈ సినిమాను సితార ఎంటర్టైన్‌మెంట్స్‌ నిర్మించనుంది. నాగ వంశీ నిర్మాతగా వ్యవహరించనున్నారు. కానీ బాలయ్య ఇలా సడెన్ షాక్ తో బాబీ పరిస్థితి ఏంటని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి బాబీ కొత్త కథతో బాలయ్యను మెప్పిస్తాడా.. లేదా.. వేరే దర్శకుడికి బాలయ్య ఛాన్స్ ఇస్తాడా అనేది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: