టాలీవుడ్ ఇండస్ట్రీలో మన్మధుడుగా నాగార్జున పేరు సంపాదించారు.. తన కెరియర్ లో ఎన్నో విభిన్నమైన సినిమాలలో కూడా నటించి మంచి క్రేజీ సంపాదించుకున్నారు. ఎన్నో పండుగలకు తమ సినిమాలను విడుదల చేసి ఫ్యామిలీ ఆడియన్స్  ను బాగా మెప్పించారు నాగార్జున.. అయితే గత కొన్ని ఏళ్లుగా సరైన సక్సెస్ మాత్రం తన కెరియర్ లో రాలేకపోతోంది. చివరిగా బంగార్రాజు సినిమాతో సంక్రాంతికి డీసెంట్ హిట్ అని అందుకున్నారు. ఇప్పుడు జేట్ స్పీడ్ తో మరొక సినిమాని సంక్రాంతిని టార్గెట్ చేస్తూ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
మొదట అనుకున్న ప్రాజెక్టు ప్రణాళికలు క్యాన్సిల్ కావడంతో ఇప్పుడు మరొక కథను లైన్లోకి తీసుకువచ్చారు నాగార్జున.. నాగార్జున 99 వ సినిమాగా తెరపైకి తీసుకురావడం జరిగింది ఈ ప్రాజెక్టు.. నాగార్జున పూర్తిస్థాయిలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.. సినిమాటోగ్రాఫర్ విజయ్ జిన్నిని దర్శకుడుగా పరిచయం చేస్తూ నాగార్జున ఒక కొత్త సినిమాని అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ఈరోజు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. ఇక కొద్దిసేపటి క్రితమే ఒక చిన్న అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది చిత్ర బృందం.


ఈ అనౌన్స్మెంట్ పోస్టర్లో ఒక టైటిల్ తో పాటు దానికి మీద కత్తి కూడా ఉంది ఇక బ్యాక్ గ్రౌండ్లో పూర్తిగా పల్లెటూరు వాతావరణాన్ని తలపించేలా కనిపిస్తోంది. నాగార్జునకు విలేజ్ బ్యాక్ గ్రౌండ్ ప్రతిసారి కూడా బాగా అచ్చోచ్చినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈసారి కూడా సంక్రాంతికి ఈ సినిమా ఇదే తరహాలో సక్సెస్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ పోస్టర్ కు మంచి క్యాప్షన్ కూడా ఇవ్వడం జరిగింది..కింగ్ వస్తున్నాడు రేపు ఉదయం 10:27 నిమిషాలకు మరొక అప్డేట్ తో రాబోతున్నామంటూ తెలిపారు. ఈ సినిమా టైటిల్ ని రివిల్ చేయబోతున్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

HBD