ప్రస్తుతం డెవిల్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గడిచిన కొద్ది రోజుల క్రితం డెవిల్ సినిమాకు సంబంధించి టీజర్ ని సైతం విడుదల చేయగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమా గురించి తాజాగా ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి రావడం జరిగింది. ఈ సినిమా ఇప్పుడిప్పుడే మొదలయ్యింది కాదు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కోసం దాదాపుగా రెండు సంవత్సరాలు పట్టిందట. జార్జిరెడ్డి, మైకేల్, రాక్షసుడు వంటి చిత్రాలకు పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ గాంధీ ఈ సినిమా కోసం పని చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలోని చాలా సన్నివేశాలు సైతం రియస్టిగ్ గా ఉండబోతున్నాయట.
అంతేకాకుండా పురాతన కాలానికి సంబంధించిన వాటిని పునర్నిర్మించడం కోసం చాలానే కష్టపడినట్లుగా తెలుస్తోంది. చాలా పరిశోధనలు చేసి వీటిని నిర్మిస్తున్నట్లుగా సమాచారం. అందుకోసమే ఎక్కువ సమయం పడుతుందని తెలుస్తోంది. బ్రిటిష్ వారు పాలించినప్పుడు మన దేశం ఎలా ఉంది బ్రిటిష్ వారి అభిరుచులు ఎలా ఉండేవి అనే వాటిని తెలుసుకోవడానికి గాంధీ వంటి సినిమాలు చూసి వాటిని తయారు చేస్తున్నారట. ఈ విషయాలన్నీ ఆర్ట్ డైరెక్టర్ గాంధీ స్వయంగా తెలియజేశారు. చాలా పుస్తకాలు చదివి ఇందులో కొన్ని విషయాలను తెలుసుకున్నామని ఆ కాలంనాటి వస్తువులు ఫర్నిచర్ పెయింట్ ఎలా ఉండేవో తెలుసుకుందామని భారతదేశానికి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వారి హయాంలో వాళ్ల ఏజెంట్గా పని చేసిన ఒక వ్యక్తి కథాంశంతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాని డైరెక్టర్ నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి