ఇక విజయ్ ఆంటోని పర్సనల్ విషయానికి వస్తే.. విజయ్ ఆంటోని వైస్ పేరు ఫాతిమా.. ఇమెను ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. వీరికి లారా అనే ఒక కుమార్తె కూడా ఉన్నది. విజయ్ ఆంటోనికి 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే వారి తండ్రి మరణించారు. ఆ తర్వాత తమ ముత్తాత మాజీ రచయిత అయిన శ్యామూల్ వేదనయం పిల్లయన్ దగ్గర పెరగడం జరిగిందట. విజయ్ ఆంటోని సినిమాలలోకి రాకముందు తమిళనాడులో నాగర్ కోయిల్లో జన్మించారు. ఇతని స్వస్థలం కూడా అదే. విజయ్ ఆంటోని మొదట పలు చిత్రాలలో చిన్న చిన్న పాత్రలలో నటించారు కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. క్రైమ్ థ్రిల్లర్ అయిన నాన్ అనే సినిమా చేసి మంచి అవకాశాన్ని సంపాదించుకున్నారు.
తాజాగా విజయ్ ఆంటోని కూతురు లారా విజయ్ ఆంటోని సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈమె ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లుగా సమాచారం. లారా విజయ్ ఆంటోనీ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం..అయితే ఈ విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే దగ్గరలోని నియు కావేరి ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మృతి చెందినట్లు తెలుస్తోంది అయితే ఈ మృతికి గల కారణాలు ఏంటి అనే విషయం ఇంకా తెలియడం లేదు.. ఈ విషయం తెలిసి పలువురు అభిమానులు సైతం తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి