టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకే చోట సందడి చేస్తే అభిమానులకు కన్నుల పండుగగా ఉంటుంది అనే సంగతి మనకు తెలిసిందే. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ కూడా ఓకే చోట చేరి పెద్ద ఎత్తున సందడి చేశారు.నేడు అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి కావడంతో అన్నపూర్ణ స్టూడియోలో నాగేశ్వరరావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున టాలీవుడ్ సెలబ్రిటీలు అందరిని కూడా ఆహ్వానించారు. దీంతో పెద్ద ఎత్తున దర్శక నిర్మాతలు హీరోలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఇక ఈ వేదికపై ఎంతోమంది టాలీవుడ్ సెలబ్రిటీలు సీనియర్ నటీనటులు మాట్లాడుతూ ఏఎన్ఆర్ గారితో వారికి ఉన్నటువంటి అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు. ఇక ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి రామ్ చరణ్ మహేష్ బాబు కూడా హాజరయ్యారు మహేష్ బాబు నమ్రత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనీ సందడి చేశారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్, మహేష్ బాబు పక్కపక్కనే కూర్చుని పలు విషయాల గురించి చర్చించుకున్నారు.  ఇక నమ్రత సైతం రామ్ చరణ్ తో మాట్లాడుతూ కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇలా స్టార్ హీరోలు ఇద్దరిని ఒకే ప్రేమ్ లో చూడటంతో అభిమానులు ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ హీరోల సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండగా మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో పోటీకి దిగబోతున్నాయని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: