తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత క్రేజ్ ఉన్న హీరోలు అయినటువంటి నాగార్జున , మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్ , అల్లు అర్జున్ , విజయ్ దేవరకొండ లకు సంబంధించిన మూవీ లు ప్రస్తుతం చిత్రీకరణ దశల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ నటులు ఏ మూవీ లలో హీరోలుగా నటిస్తున్నారు ..? వారికి సంబంధించిన సినిమా షూటింగ్ లు ప్రస్తుతం ఎక్కడ జరుగుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం నా సామి రంగ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం వట్టి నాగులపల్లి పరిసర ప్రాంతాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు మహేష్ బాబు మరియు కొంత మంది ఇతరులపై జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎన్టీఆర్ పై ఈ మూవీ కి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అల్లు అర్జున్ పై ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విజయ్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: