విజయ్ ఆంటోని కూతురు మీరా ఆంటోని మరణం సౌత్ సినీ అభిమానులను ఎంతగానో బాధ పెట్టింది. తల్లీదండ్రులకు మీరా ఆంటోని మరణం ఎంతో బాధ ను మిగిల్చింది.ఈ ఏడాది ఇప్పటికే బిచ్చగాడు2, హత్య సినిమా లను విజయ్ ఆంటోని థియేటర్ల లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. విజయ్ ఆంటోని నటించిన రత్తం మూవీ వచ్చే నెల 6వ తేదీన థియేటర్ల లో రిలీజ్ కావాల్సి ఉందని తెలుస్తోంది.మీరా ఆంటోని మరణం వల్ల ఈ సినిమా రిలీజ్ డేట్ మారే ఛాన్స్ అయితే ఉందని అందరూ భావించారు. అయితే కూతురు చనిపోయినా సినిమా రిలీజ్ ఆపొద్దని విజయ్ ఆంటోని సూచించారట. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సినిమా రిలీజ్ డేట్ మార్చితే సినిమా కలెక్షన్ల పై ఎఫెక్ట్ పడుతుందని నిర్మాత నష్టపోయే అవకాశం ఉందని అందువల్ల రత్తం మూవీని ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రిలీజ్ చేయాలని విజయ్ ఆంటోని కోరారట.

 సినిమాల విషయం లో విజయ్ ఆంటోనికి ఏ స్థాయి లో గౌరవం ఉందో చెప్పడానికి ఈ ఘటనే సాక్ష్యమని విజయ్ ఆంటోని నిజంగా గ్రేట్ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నటుడి గా, నిర్మాతగా, సంగీతదర్శకుడి గా, దర్శకు డిగా ప్రతిభ చూపిన విజయ్ ఆంటోని ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ ఈ స్థాయికి ఎదిగారు. తన సినీ కెరీర్ లో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా లలో విజయ్ ఆంటోని ఎక్కువ గా నటించడం గమనార్హం. ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా అదే తేదీన థియేటర్ల లో విడుదల కానుందని సమాచారం అందుతోంది. రత్తం మూవీ ఇప్పటికే పలు రిలీజ్ డేట్లను మార్చుకున్న నేపథ్యంలో ఈ మూవీ రిలీజ్ ను మరో మారు వాయిదా వేయడం కరెక్ట్ కాదని హీరో విజయ్ ఆంటోని ఫీలవుతున్నారని సమాచారం అందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: