
అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం జరిగే సమయంలో శ్రీ లీల ఈ సినిమా నుంచి తప్పుకున్నాను అంటూ షాకింగ్ న్యూస్ వెల్లడించారు. ఇలా శ్రీ లీల ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో చిత్రబంధం మరొక హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టారు. అయితే విజయ్ దేవరకొండ సినిమాకు కమిట్ అయినటువంటి శ్రీ లీల ఈ సినిమాకు దూరం కావడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే... శ్రీ లీల ఇప్పటికే పలు సినిమాలకు కమిట్ అయిన విషయం మనకు తెలిసిందే అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ పనులు వాయిదా పడటం లేదా ఆలస్యంగా జరగడం జరుగుతుంది. దీంతో ఈ సినిమా షూటింగ్ పనులు జరగకపోవడం వల్ల ఈమె కమిట్ అయినటువంటి కొత్త సినిమా షూటింగ్ పనులకు డేట్స్ ఏమాత్రం అడ్జస్ట్ కావడం లేదట దీంతో తప్పనిసరి పరిస్థితులలో ఈమె అవకాశాలను వదులుకోవాల్సి వస్తుందని తెలుస్తుంది.
ఇలా విజయ్ దేవరకొండ సినిమా నుంచి తప్పుకోవడం మాత్రమే కాకుండా రవితేజ సినిమా నుంచి కూడా శ్రీ లీల తప్పుకున్నారని తెలుస్తోంది. రవితేజ శ్రీ లీల కాంబినేషన్లో వచ్చినటువంటి ధమాకా సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో మరోసారి రవితేజ సినిమాలో ఈమెకే అవకాశం కల్పించారట. అయితే డేట్స్ అడ్జస్ట్ కాలేని కారణంగా ఈమె ఈ సినిమా నుంచి కూడా తప్పకుండా తెలుస్తుంది.