యష్ రాజ్ ఫిలిం పైన స్పై యూనివర్సిటీలో భాగంగా టైగర్-3 సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఫలితాన్ని ఆకట్టుకోలేకపోయింది. షారుఖ్ ఖాన్ వరుసగా 1000 కోట్లు మార్కును అందుకని సంచలనాలను సృష్టిస్తున్నాడు. అతనికి దీటుగానే సల్మాన్ ఖాన్ కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవ్వాలని పది రకాల ప్రయత్నాలతో టైగర్-3 చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది.అయితే ఈ సినిమాలో భారీ హంగులు ఉన్నప్పటికీ భారీ బడ్జెట్ చిత్రంతో నిర్మించిన పెద్దగా ఆకట్టుకోలేదని తెలుస్తోంది. షారుక్ ,హృతిక్ రోషన్ అతిథి పాత్రలో వచ్చిన ఫెయిల్యూర్ గానే మిగిలినట్లు తెలుస్తోంది.


కలెక్షన్స్ పరంగా కూడా ఈ చిత్రం ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. ఒకరకంగా ఇది రచయితల వైఫల్యమే అన్నట్లుగా పలువురు సినీ ప్రముఖుల సైతం భావిస్తూ ఉన్నారు. అయితే ఇవే కాకుండా స్పై ఏజెంట్ మూవీస్ జోనర్ సినిమాలు గతంలో బాగా పాపులర్ అయ్యాయి. కానీ ఈసారి మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోవడానికి ముఖ్య కారణం చాలానే ఉన్నాయి.. అఖిల్ నటించిన ఏజెంట్ నిఖిల్ నటించిన స్పై సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. చిన్న బడ్జెట్ సినిమాలైనా కూడా ఇవి ఆ మొత్తాన్ని కూడా రికవరీ చేయలేకపోయని తెలుస్తోంది.


అయితే అందుకు కారణం సరైన కంటెంట్ లేకుండా సినిమాలను తెరకెక్కిస్తూ ఉండడమే కాకుండా భారీ బడ్జెట్ సినిమాలతో సంబంధంలేని కథలతో సినిమాలను తెరకెక్కిస్తూ ఉండడంతో ఇలా పరాజయాల బాటపడుతున్నాయని కొంతమంది సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా సినిమా లెంత్ సాగదీతతో ఉండడంతోపాటు.. సినిమా ప్రచారంలో భాగంగా ఒకటి చెప్పి సినిమా విడుదలైన తర్వాత సినిమాలో మరొక లాగా కనిపిస్తూ ఉండడంతో ప్రేక్షకులు పెద్దగా ఆకట్టుకోలేక పోతోంది ట్రైలర్ లో కూడా ఎంతో జాగ్రత్తగా కట్ చేసిన సినిమా విషయంలో ఫెయిల్యూర్ గానే మిగిలిపోతున్నారు దర్శకనిర్మాతలు. దాదాపుగా ఈ ఏజెంట్ చిత్రాలతో కొన్ని కోట్ల రూపాయల నష్టాన్ని సైతం నిర్మాతలు అందుకుంటున్నారు మరి ఇక మీదటైన జాగ్రత్తపడి ఇలాంటి సినిమాలను తీస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: