బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా యానిమల్. ఈ మూవీ డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ఐదు భాషలలో థియేటర్స్ లోకి వస్తోంది.ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోన్న ఈ సినిమాపై దర్శక, నిర్మాతలు చాలా నమ్మకంగా ఉన్నారు. కచ్చితంగా ఈ మూవీతో సాలిడ్ హిట్ కొడతామని అంచనా వేస్తున్నారు.ఈ సినిమా ట్రైలర్ కి కూడా ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ రావడం, సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ప్రీరిలీజ్ ఈవెంట్ లో యానిమల్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించడం ఓ విధంగా కలిసొచ్చే అంశం అని చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాని 200 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్లు ఇప్పటికే నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. టి-సిరీస్ ఈ సినిమా నిర్మాణంలో మేజర్ పార్టనర్. యానిమల్ మూవీకి కేవలం నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే 70వ వంతు పెట్టుబడి తిరిగి వచ్చేసిందని సమాచారం తెలుస్తోంది. అందుకే థీయాట్రికల్ రిలీజ్ నేరుగా టి-సిరీస్ అన్ని రాష్ట్రాలలో డైరెక్ట్ గా రిలీజ్ చేయడానికి రెడీ అయింది.


ఒక్క తెలుగులోనే దిల్ రాజు ఈ సినిమా రైట్స్ సొంతం చేసుకొని విడుదల చేస్తున్నారు.మొత్తం 15 కోట్లకి తెలుగు రైట్స్ ని దిల్ రాజు సొంతం చేసుకున్నారు.తెలుగులో కూడా మూవీ రిలీజ్ తర్వాత నిర్మాతకి ప్రాఫిట్ లో షేర్ ఇచ్చే విధంగానే ఒప్పందం జరిగిందని సమాచారం తెలుస్తోంది. హైదరాబాద్ లో ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ మాములుగా లేవు.ఈ సినిమాకి ఉన్న హైప్ చూస్తుంటే ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కానీ మొదటి మూడు రోజుల్లోనే తెలుగులో బ్రేక్ ఈవెన్ అయిపోతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ మూవీకి ఉన్న క్రేజ్ ని బట్టి ప్రపంచవ్యాప్తంగా మినిమం 350 - 400 కోట్ల వీకెండ్ వసూళ్లు సాధిస్తుంది.పాజిటివ్ టాక్ వస్తే మాత్రం యానిమల్ మూవీ కనీసం 1000 కోట్ల గ్రాస్ లేదా అంతకంటే ఎక్కువ కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవాలంటే హిందీ థియేట్రికల్స్ నుంచి నిర్మాతలకు కేవలం 50 కోట్ల షేర్ వస్తే సరిపోతుంది. అది ఫస్ట్ రోజే వచ్చేసే అవకాశం ఉంది. ఈ లెక్కలు చూసుకుంటే ఏ విధంగా చూసుకున్న యానిమల్ సినిమాతో నిర్మాతకి లాభాలు పక్కా అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: