ఫ్యాన్ వార్‌… దీనిని కొంతమంది అభిమానులు తమ అభిప్రాయాన్ని చెప్పే వేదికగా చేసుకుంటే, మరికొంతమంది తన అసూయను, తెలివి తక్కువతనాన్ని చూపించే వేదికగా చేసుకుంటారు.ఎందుకు పుట్టుకొస్తుందో, ఎలా పుట్టుకొస్తుందో తెలియదు కానీ… ఆ వార్‌ వచ్చేస్తుంది అంతే. తాజాగా సోషల్‌ మీడియాలో ఓ ఫ్యాన్ వార్‌ నడుస్తుంది. అయితే ఫ్యాన్‌ వార్‌ నడుస్తున్న ఇద్దరి హీరోలకు ఎలాంటి సంబంధం లేదు. మరో హీరో అన్న మాటల్ని కొంతమంది ఇంకో హీరోకు ఆపాదిస్తున్నారు.''నేను హీరోని అయినా, కాకపోయినా పవన్ కల్యాణ్ ఫ్యాన్‌ని. ఎప్పటికీ అదే మాట చెబుతాను. కొంతమందిలా ఓ స్టేజ్‌కు వెళ్లిన తర్వాత పేరు ప్రస్తావించకుండా వదిలేయను'' అని నితిన్‌ ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో నితిన్‌ ఈ కామెంట్స్ చేశారు. అయితే అందులో పవన్‌పై అతడికున్న ప్రేమ, అభిమానం కనిపిస్తుంది. కానీ కొంతమందికి మాత్రం అందులో 'కొంతమందిలా' అనే ఒక్క పదమే కనిపిస్తోంది.పవన్  ఫ్యాన్స్ అని చెప్పుకునే కొందరు ఈ స్టేట్ మెంట్‌ను అల్లు అర్జున్‌కు ట్యాగ్‌ చేస్తున్నారు. కెరీర్ ప్రారంభంలో పవన్ కల్యాణ్‌ను పొగిడి, ఓ స్థాయి వచ్చిన తర్వాత 'చెప్పను బ్రదర్‌' అని బన్నీ అన్నాడు అంటూ నితిన్‌ మాటల్ని ప్రస్తావిస్తున్నారు. నితిన్‌ను చూసి నేర్చుకోవాలంటూ వైరల్ చేస్తున్నారు. దీంతో నితిన్‌ వ్యాఖ్యల్ని అనవసరంగా పవన్‌ ఫ్యాన్స్‌ వైరల్ చేశారు అంటూ మరికొంతమంది ఫ్యాన్స్‌ అంటున్నారు.అనవసరంగా లేనిపోని పంచాయితీలు అవ్వుతున్నాయని, ఎవరి వ్యాఖ్యల్ని వాళ్ల వరకు తీసుకుంటే ఈ ఇబ్బంది ఉండేదికాదు కదా అని అంటున్నారు. అయితే ఇక్కడ కొంతమంది మరచిపోయిన విషయం ఏంటంటే… ఇప్పుడు పవన్‌, బన్నీ మధ్య ఎలాంటి దూరం లేదు. వాళ్లు ఎప్పట్లానే ఉన్నారు. 'చెప్పను బ్రదర్‌' అంటూ ఫ్యాన్స్‌ చేసిన నానా యాగీ మాత్రమే మిగిలింది. కాబట్టి లేనిపోని మాటలతో జరిగే ఫ్యాన్‌ వార్‌ వల్ల ఏమీ ఉపయోగడం ఉండదు అని మరోసారి తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: