టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కొంతకాలం క్రితం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందిన "ది ఘోస్ట్" అనే సినిమాలో హీరోగా నటించాడు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. కాకపోతే ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. దానితో ఈ సినిమాతో నాగార్జున కు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆపజయం దక్కింది. ఇలా "ది ఘో" మూవీ తో ప్రేక్షకులను నిరాశ పరిచిన నాగార్జున ఆ తర్వాత కొంత ఎక్కువ కాలమే గ్యాప్ తీసుకొని కొన్ని రోజుల క్రితమే విజయ్ బిన్నీ దర్శకత్వంలో "నా సామి రంగా" అనే సినిమాను ప్రారంభించాడు.

మూవీ లో అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ కీలక పాత్రలలో కనిపించనుండగా ... ఆశిక రంగనాథ ఈ సినిమాలో నాగార్జున కు జోడిగా కనిపించబోతుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ లోని ఆశగా ఫస్ట్ గ్లిమ్స్ వీడియోను ఈ చిత్ర బృందం విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కనుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ఇప్పటికే ప్రకటించింది.

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ మేకర్స్ ఈ మూవీ లోని మొదటి పాటను విడుదల చేయడానికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లోని మొదటి పాటను ఈ వారం రోజుల్లోనే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ మూవీ మొదటి పాట "ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తోందే" అంటూ సగబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: