టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటువంటి అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తండెల్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి కార్తికేయ 2 మూవీ తో ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న చందు మండేటి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి ఈ చిత్ర బృందం ఈ సినిమా టైటిల్ మరియు నాగ చైతన్య కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. మరి ముఖ్యంగా ఈ మూవీన్లో చైతూ లుక్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ వీడియోను విడుదల చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ వీడియోను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో కోసం అల్లు స్టూడియోస్ లో ఈ మూవీ బృందం వారు తాజాగా షూట్ ను కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక డిసెంబర్ 20 వ తేదీ లోపు ఈ మూవీ గ్లిమ్స్ వీడియోను విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు అలాగే ఈ వీడియోను సలార్ మూవీ తో అటాచ్ చేసి ధియేటర్ లలో ప్రదర్శించే ఆలోచనలో ఈ చిత్ర బృందం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే తండెల్ మూవీ గ్లిమ్స్ వీడియోలో నాగచైతన్య మాస్ డైలాగ్స్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: