
ఇప్పటికే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కూడా ఈ చిత్రాన్ని పొగిడేస్తూ రివ్యూ ఇవ్వడం జరిగింది. అయితే చాలామంది సెలబ్రిటీలు సైతం ఈ సినిమాకి సంబంధించి రివ్యూ ని ఇవ్వడానికి భయపడుతున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ సైతం ఈ సినిమా పైన మనసు పారేసుకున్నట్లుగా తెలుస్తోంది. తన ట్విట్టర్ నుంచి ఈ సినిమా మైండ్ బ్లోయింగ్ సినిమా బ్రిలియన్స్ అద్భుతమైన పని రణబీర్ కపూర్ భారతీయ సినిమాలో సరికొత్తస్థాయికి తీసుకువెళ్లారంటూ కూడా తెలియజేయడం జరిగింది. రష్మిక యాక్టింగ్ కూడా బ్రిలియంట్ అని అత్యుత్తమ నటిగా తెలియజేశారు.
బాబీ డియోల్ ,అనిల్ కపూర్ ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా నటించారని మరొక నటి త్రిప్రి డిమ్రి ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టింది అంటు యానిమల్ సినిమా బృందానికి మొత్తం ట్వీట్ చేశారు.. డైరెక్టర్ గురించి తెలియజేస్తూ డైరెక్టర్ సందీప్ మీరు అన్ని సినిమా పరిమితులను అధిగమించారు.. మీరు మరొకసారి మా అందరిని గర్వపడేలా చేశారంటూ మీ సినిమాల భవిష్యత్తులో భారతీయ సినిమా ముఖచిత్రాన్ని ఎలా మార్చబోతుందో స్పష్టంగా చూపించారు అంటూ ట్వీట్ చేయడం జరిగింది. యానిమల్ సినిమా ఖచ్చితంగా ఇండియన్ క్లాసికల్ మూవీలలో ఒకటిగా చేరుతుందంటూ అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ట్విట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.