ఇదంతా పక్కన పెడితే అల్లరి నరేష్ కి పెళ్లి జరిగి, ఒక పాప కూడా పుట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పట్లో నరేష్ సినిమాలోని హీరోయిన్లు చాలా బాగుండేవారు. చేసిన హీరోయిన్ తో మరోసారి సినిమా చేసే అలవాటు లేని అల్లరి నరేష్, ఫర్జానా అనే హీరోయిన్ తో ఏకంగా మూడు నుండి నాలుగు సినిమాలు చేసాడు.సినీ ఇండస్ట్రీ లో ఇలా రిపీట్ గా హీరో హీరోయిన్ కాంబినేషన్స్ తెరకెక్కితే వాళ్ళ మధ్య ప్రేమ ఉందని , త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ఇలా ఎన్నో రకాల వార్తలు పుట్టిస్తుంది మీడియా. అలా అల్లరి నరేష్ మరియు ఫర్జానా మధ్య కూడా అలాంటి పుకార్లు చాలానే పుట్టించారు. కొన్ని వెబ్ సైట్స్ అయితే వీళ్లిద్దరు పెళ్లి చేసేసుకున్నారు అని కూడా చెప్పారు. ఈ వార్తలు ఈవీవీ సత్యనారాయణ చూసి ఎవరు రా నాకోడలు, ఇంటికి తీసుకొని రా అని సరదాగా అనేవాడట. అంతే కాదు వీళ్ళ మధ్య లవ్ బ్రేకప్ అయ్యింది అని కూడా అప్పట్లో రూమర్స్ వినిపించేవి.
దీనిపై అల్లరి నరేష్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, ఆ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు. సాధారణంగా ఎవరైనా హీరోయిన్ షూటింగ్ కి వచ్చేటప్పుడు తన తల్లితండ్రులను లొకేషన్ కి తోడుగా తెచ్చుకుంటారు. కానీ ఫర్జానా తన బాయ్ ఫ్రెండ్ ని తోడుగా తెచ్చుకునేది. అలాంటి కమిటెడ్ అమ్మాయితో నాకు ప్రేమాయణం ఉన్నట్టుగా రాసారు అంటూ అల్లరి నరేష్ అప్పట్లో వివరణ ఇచ్చుకున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి