జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఏవో కారణాలతో చాలా బ్లాక్ బస్టర్ సినిమా లను మిస్ చేసుకున్నాడు. అయితే బోయపాటి శ్రీను దర్శకుడి గా పరిచయమైన మొదటి సినిమా భద్ర. ఈ సినిమా కథని మొదటగా ఎన్టీఆర్ తో తెరకెక్కించాలని బోయపాటి భావించాడట. అయితే ఎన్టీఆర్‌కు ఈ కథని బోయపాటి వినిపించగా.. ఇండస్ట్రీ కి అతను కొత్త, కథ చెప్పే విషయంలో కూడా తడబడుతున్నారు.. కొత్త డైరెక్టర్ తో ఈ తరహా సినిమాలో తీయడం రిస్క్ అవుతుందేమోనని సందేహం తో ఎన్టీఆర్ ఈ సినిమా చేయడానికి ఇష్టపడలేదట.
దీంతో చేసేదేమీ లేక బోయపాటి ఈ సినిమా కాదని మాస్ మహారాజ్ రవితేజ వద్దకు తీసుకు వెళ్ళాడు. ఈ సినిమా ను ఆయన ఓకే చేయడంతో రవితేజ హీరో గా పెట్టి భద్ర సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీలో మీరాజాస్మిన్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ సెన్సేషన్ గా నిలిచింది. ఈ సినిమా రిలీజ్ అయి సక్సెస్ సాధించిన తర్వాత అనవసరంగా ఈ సినిమాను వదులుకున్నానే అని ఎన్టీఆర్ ఎన్నో సందర్భాల్లో బాధపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ గతంలో జరిగిన ఇంటర్వ్యూలో వివరించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి