మా మూలుగా సినిమాల్లో తెరమీద హీరోలు, హీరోయిన్లు జోకులు పేలుస్తూ ఉంటారు. కానీ షూటింగ్ గ్యాప్ టైంలో తెరవెనక కూడా నటీనటుల మధ్య చాలా జోకులు పేలుతూ ఉంటాయి.తెరమీద అస్సలు బూతులు మాట్లాడని ఏఎన్నార్ షూటింగ్ గ్యాప్‌లో హీరోయిన్లను బండ బూతులు తిట్టేవారట. అయితే అవన్నీ నవ్వుగా ఉండేవే తప్పా.. ఎవ్వరిని బాధపెట్టేలా ఉండేవే కావట. ఇప్పటి తరం హీరో, హీరోయిన్ల సంగతేమో గాని అప్పట్లో షూటింగ్ టైంలో ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా… ఆహ్లాదమైన వాతావరణంలో కలిసి మెలిసి పనిచేసేవారు.ఈ క్రమంలోనే పాత తరం సీనియర్ హీరో ఆంధ్రా అందగాడు శోభన్‌బాబుపై కూడా చాలా మంది హీరోయిన్లు జోకులు, సెటైర్లు వేసేవారట. ఆయన ఎవ్వరిని నొప్పించని మనస్తత్వంలో ఉండేవారు. ఈ క్రమంలోనే ఆయనతో కలిసి నటించిన వాణిశ్రీ, శారద, శ్రీలక్ష్మి ఆయనపై జోకులు వేస్తూ సరదాగా ఆటపట్టించడంతో సెట్లో అంతా సందడి సందడిగా ఉండేదట. శోభన్‌బాబు కూడా వాటిని స్పోర్టివ్‌గానే తీసుకునేవారట.

వీరి తర్వాత తరం హీరోయిన్లు జయప్రద, జయసుధ, శ్రీదేవి కూడా శోభన్‌బాబుతో కలిసి నటించారు.. నటించేందుకు పోటీపడిన వారే. జయప్రద అయితే శోభన్‌బాబుతో నటించే ఛాన్స్ వస్తే తాను ఎంత బిజీగా ఉన్నా కూడా డేట్లు సర్దుబాటు చేసుకుని మరీ కాల్షీట్లు ఇచ్చేవారట. ఇక వాణిశ్రీ అయితే శోభన్‌బాబు అంటే ఎంతో ప్రాణం పెట్టేవారట. శోభన్‌బాబుతో చేసేందుకు ఆమె ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు కూడా వదులుకున్నారట.ఆమె సెట్లో అందరిముందే శోభన్‌బాబుతో నటించడం అంటే నాకు సొంత మొగుడి పక్కన నటించినట్టే, ఉన్నట్టే ఉండేదని ఆమె కామెంట్ చేసేదట. ఈ మాటను బట్టే వాణిశ్రీ శోభన్‌బాబు విషయంలో ఎంత కంపర్ట్ ఫీలయ్యేవారో తెలుస్తోంది. శోభన్‌బాబు కూడా వాణిశ్రీని ఏమీ అనేవారు కాదట. ఆమె ఏం అన్నా కూడా నవ్వేవారట. వారి మధ్య అంత చనువుకు కారణం.. వ్యక్తిగతంగా కూడా.. వాణిశ్రీకి శోభన్‌బాబు పట్ల ఉన్న మక్కువే అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: