మెగా హీరో వరుణ్ తేజ్ మరికొన్ని రోజు ల్లో ఆపరేషన్ వాలంటైన్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మార్చి నెల 1వ తేదీన ఈ సినిమా థియేటర్ల లో విడుదల కానుంది.ఈరోజు విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగం గా వరుణ్ తేజ్ షాకింగ్ విష యాలను వె ల్లడించారు. సాయుధ బలగాలపై సినిమాలు తక్కువగా వస్తున్నాయనే ఆలోచన తోనే ఆపరేషన్ వాలంటైన్ తెరకెక్కించామని వరుణ్ తేజ్ తెలిపారు.దేశభక్తి ప్రతి ఒక్కరి లో ఉంటుందని కానీ అలాంటి సినిమాలు ఎక్కువ గా రాకపోవడానికి కారణమేంటో నాకు తెలియదని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు. నా బెస్ట్ సినిమాలలో కంచె  ఒకటని దేశభక్తి నిండిన అలాంటి సినిమా లో నటించడం నా లక్ అని వరుణ్ తేజ్ వెల్లడించారు. మళ్లీ ఆ తరహా సినిమా అవకాశాలు రావట్లేదే అనుకునే సమయంలో ఆపరేషన్ వాలంటైన్ వచ్చిందని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు. కంచె మూవీకి మించిన ఎమోషన్స్ ఈ సినిమా లో ఉంటాయని ఆయన కామెంట్లు చేశారు. ధృవ సీక్వెల్ లోనే నెందుకు చేస్తానని చరణ్ అన్నయ్యే చేయొచ్చని వరుణ్ తేజ్ తెలిపారు. పవన్ కళ్యాణ్సినిమాలో విలన్ గా చేయనని అలా చేస్తే ఫ్యాన్స్ చంపేస్తారని వరుణ్ తేజ్ సరదాగా చెప్పుకొచ్చారు. జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తానని వరుణ్ తేజ్ కామెంట్లు చేశారు. పూల్వామా దాడి ఇతివృత్తాన్ని చూపించబోతున్నా సెక్యూరిటీ కారణాల వల్ల అలాంటి ఘటనలకు సంబంధించిన పేర్లు పెట్టకూడదని అందుకే ఆపరేషన్ వాలంటైన్ ఎంపిక చేశా మని వరుణ్ తేజ్ అన్నారు. నేను ఫైటర్ సినిమా చూశానని ఆ సినిమాకు ఈ సినిమాకు ఎలాంటి కనెక్షన్ ఉండదని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు. వరుణ్ తేజ్ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: