ఈ ఫోటోలు ఇద్దరు ఒకరి చెయ్యి మరొకరు పట్టుకొని నడుస్తూ ఉన్నట్లుగా చూపించారు.. మరొక ఫోటోలో తన భర్త నుదుటిపైన ఆప్యాయంగా ఈమె ముద్దిస్తున్నట్టుగా కనిపిస్తోంది. తాళి కట్టిన క్షణాలను కూడా కృతికర్బందా ఫోటోల ద్వారా అభిమానులకు షేర్ చేసింది. అయితే వీరిద్దరూ వీరికే వెడ్డింగ్, తైష్, పాగల్పంటి అంటే చిత్రాలలో నటించారు అలా 2019లో వీరిద్దరు ఒక సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డట్టుగా సమాచారం.
అయితే నటుడు పులకిత్ కూడా గతంలో శ్వేతా రాహిరా అనే ఒక నటిని 2014 లో పెళ్లి చేసుకున్నారట.. వివాహమైన 11 నెలలకే వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారని సమాచారం. అయితే కృతి కార్బందా మాత్రం తెలుగులో బోణి, తీన్మార్ ఒంగోలు గిత్త బ్రూస్ లీ మిస్టర్ నూకయ్య తదితర చిత్రాలలో నటించింది. కానీ చెప్పుకోదగ్గ సినిమాలు మాత్రం ఈమె సక్కు సక్సెస్ ఇవ్వలేదు. అలాగే తమిళ్ కన్నడ వంటి భాషలలో కూడా నటించిన ఈ ముద్దుగుమ్మ అక్కడ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో బాలీవుడ్ వైపుగా అడుగులు వేసింది. అక్కడ ఒక మోస్తారు గానీ అవకాశాలను అందుకొని బాగానే సక్సెస్ అయినట్టు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి