అతి తక్కువ ధర ఈ క్యాండిల్స్ దే. ఇక పర్షియన్ స్టైల్ రగ్గు ధర రూ.3.95 లక్షలుగా ఉంది. డైనింగ్ టేబుల్స్, పరుపులు, మంచాలు, కిచెన్ లో వాడే వస్తువులు, రగ్గులు, లైటింగ్స్ వంటి వన్నీ ఈ పాటరీ బార్న్ ఇండియా వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయి. తన కొత్త బిజినెస్ గురించి దీపికా స్పందించింది."ఇదేదో ఆశామాషీ భాగస్వామ్యం కాదు. చాలా బ్రాండ్లలాగా ఏవో పది వస్తువులను పంపించి ఇందులో ఏదో ఒకదానికి ఓకే చెప్పేయండి.. మీ పేరు పెట్టి అమ్మేస్తాం అనేలా కాదు. నేను ఇందులో ప్రతి దానిపై పని చేశాను. అది అంత సులువైన విషయం కాదు. ఆ సంస్థ కాలిఫోర్నియాలో ఉంది. నేను ఇండియాలో ఉన్నాను. ఇద్దరి మధ్య ఎన్నో విషయాలపై ఎంతో చర్చ జరిగింది. సుమారు రెండేళ్ల పాటు శ్రమిస్తే వీటికి ఒక తుదిరూపు వచ్చింది" అని దీపికా తెలిపింది. నిజానికి దీపికా పదుకోన్ పాటరీ బార్న్ కు డిసెంబర్, 2022లో బ్రాండ్ అంబాసిడర్ అయింది. కొన్ని నెలల తర్వాత దీనిని ఇండియాలోనూ లాంచ్ చేశారు.అలాగే ఈ జంట సెప్టెంబర్ లో తమ మొదటి బేబీకి జన్మనివ్వబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే దీపిక పదుకొనే తన సినిమాలతో,బిజినెస్ లతో ఇప్పటివరకు దాదాపు 550 కోట్ల ఆస్తులు సంపాదించినట్టు ఒక నివేదిక తెలుపుతోంది.ఇక తన భర్త రణవీర్ కపూర్ ఆస్తులు కాకుండానే కేవలం దీపిక పదుకొనే ఆస్తులే 550 కోట్లు ఉన్నాయట. ఇక ఈమెకు ముంబైలో ఫ్లాట్ తో పాటు కోట్ల ఖరీదు ఆస్తులు చాలానే ఉన్నాయట.అంతేకాకుండా లగ్జరీ కార్లు కూడా దీపికా పదుకొనే కార్ గ్యారేజీ లో ఉన్నాయి. అలా ఈమె బాలీవుడ్ లో ఉన్న రిచ్చెస్ట్ హీరోయిన్ లలో ఒకరు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి