బిగ్‌ బాస్‌ రియాలిటీ షో ఎంతో మందికి లైఫ్‌ ఇచ్చింది. సాధారణ వ్యక్తుల్ని స్టార్లని చేసింది. యూట్యూబ్‌, సోషల్‌ మీడియా ద్వారా పాపులర్‌ అయిన వాళ్లు బిగ్ బాస్‌ షోలో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుని విశేషగుర్తింపుని తెచ్చుకుంటున్నారు.చాలా మంది సినిమాల్లో బిజీ అయితే మిగిలిన వారు వారి వ్యక్తిగత వ్యాపారాలు ప్రారంభించి బిజీ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో బెట్టింగ్, ట్రేడింగ్, గేమింగ్ యాప్స్ హవా ఎక్కువైంది. దీని వల్ల చాలామంది నష్టపోతున్నారు. ముఖ్యంగా క్రికెట్ టోర్నమెంట్స్ సమయంలో ఆన్లైన్ బెట్టింగ్ జోరుగా సాగుతుంది.బెట్టింగ్ ద్వారా డబ్బు సంపాదించాలని ఆశపడి కొందరు దారుణంగా మోసపోతున్నారు. అప్పు చేసి మరి జూదం ఆడి లక్షలు, కొందరు కోట్లు పోగొట్టుకుంటున్నారు. ఇక యూత్ లో మంచి క్రేజ్ ఉన్న సెలెబ్రెటీలతో ఈ యాప్స్ ని ప్రమోట్ చేయిస్తున్నారు.వారి మాటలు నమ్మి ఆయా యాప్స్ లో డబులు పెట్టి కొందరు నష్టపోతున్నారు. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ వాసంతి డబ్బుల కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాం అన్నారు. జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మీదే అంటూ చెప్పుకొచ్చింది. షార్ట్ కట్ లో మనీ సంపాదించడానికి అతిగా ఆశపడి ఈ బెట్టింగ్ యాప్, ట్రేడింగ్ యాప్ లతో ఉన్న డబ్బంతా కోల్పోయి చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది.

అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ఇన్ స్టాగ్రామ్, పేస్ బుక్, యూట్యూబ్ లో సెలెబ్రెటీల తో ప్రమోట్ చేయిస్తున్నారు. అనేక మంది యాంకర్లు, సెలెబ్రెటీలకు సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ ఉండటంతో వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన చిన్న పెద్ద సెలెబ్రెటీలందరు వీటిని ప్రమోట్ చేస్తున్నారు. ఇక వాళ్ళ మాటలు నమ్మి బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి నష్టపోతున్నారు సామాన్యులు.ఈ క్రమంలో వాసంతి తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. హలో ఫ్యామిలీ .. నేను బెట్టింగ్, ట్రేడింగ్ సంబంధించి ఎలాంటి యాప్స్ ని ప్రమోట్ చేసినా అవి పెయిడ్ కాబట్టి చేస్తున్నాను. నాతో పాటు చాలా మంది సెలబ్రెటీలు ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఇది కేవలం డబ్బుల కోసం చేస్తున్నాము. మీకు ఇష్టమైతేనే మీ మనీ పెట్టండి. లేదంటే లేదు. ఆల్రెడీ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. దయ చేసి మేలుకోండి అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: