ప్రస్తుత కాలంలో కొంచెం పాపులారిటీ దక్కితే చాలు తమ అందాన్ని మరింత పెంచుతూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. సినిమాలో ఓ మూలన కనిపించినప్పటికీ అనంతరం తమ గ్లామర్ను పెంచేస్తూ.. తమ సొగసును సోషల్ మీడియాకి అంకితం చేస్తున్నారు. అలా ఒక సినిమాలలో నటించే యాక్ట్రెస్ ఏ కాకుండా యూట్యూబ్ మరియు ఇతర వెబ్ సిరీస్ లో నటించే వారు కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. అలా సంపాదించుకున్న అనంతరం స్టార్ హీరోయిన్స్ గా కూడా ఎదుగుతున్నారు. ఇక ఈటీవీ విన్ యాప్ లో వచ్చిన 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ ఎంత విజయవంతమైనయో మనందరికీ తెలిసిందే. అదేవిధంగా ఇందులోని పాత్రలు మరియు సన్నివేశాలు కూడా స్టోరీ కి మరింత సపోర్ట్ చేశాయి.ఈ స్టోరీ చూసిన వారంతా తమ ఇంట్లో జరిగే సన్నివేశాలను చాలా స్పష్టంగా తెలియజేశారని ప్రశంసించారు కూడా. నిజజీవితంలో జరిగిన అనుభూతుని చాలామంది ప్రేక్షకులు భావించారు. సీనియర్ హీరో శివాజీ ప్రధాన పాత్రలో నటిస్తూ రియంట్రీ ఇచ్చిన సిరీస్ నే ఈ సిరీస్. ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన శివాజీ అనంతరం వెబ్ సిరీస్ తో రీయంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ హౌస్ లో మంచి పేరు ప్రఖ్యాతలు దక్కడంతో ఈయన మరోసారి ఫామ్ లోకి వచ్చాడు. ఇక ఇందులోని ప్రధాన పాత్రలలో ఒకరైన సూచిత డేవిడ్ పాల్ క్యారెక్టర్ యూత్ కు బాగా గుర్తుండే ఉంటుంది. సుచిత అలియాస్ స్నేహాల్ కామత్.. కర్లీ హెయిర్ తో కనిపిస్తూ యూత్ లో మరోసారి ట్రెండ్ అవుతుంది.
పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఈ వెబ్ సిరీస్ తో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది. ఇక ఈ సిరీస్ కి సీజన్ 2 కూడా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ అమ్మడి సోషల్ మీడియా ఫాలోయింగ్ చూస్తే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈమె చేసిన నీ ఫోటోషూట్స్ స్టార్ హీరోయిన్స్ కూడా చేయరు. ఓ రేంజ్ లో ఫొటోస్ కి స్టిల్స్ ఇస్తూ ప్రతి ఒక్కరిని మైమరిపించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో..” ఇదేంటి.. సిరీస్లో చిన్న పిల్లలాగా కనిపించింది.
ఇప్పుడు ఏకంగా మోడల్ లాగా తయారయింది. సిరీస్ రిలీజ్ సంవత్సరం కూడా గడవలేదు. కానీ ఈమెలో మాత్రం చాలా మార్పులు వచ్చాయి. ఈ మార్పులు బాగున్నప్పటికీ.. మాకు సిరీస్లో డేవిడ్ పాల్ మాత్రమే కావాలి. ఇలా స్టైలిష్ స్టార్ వద్దు. క్యూట్ క్యూట్ మాటలతో ఉండే డేవిడ్ పాల్ మాకు ఇష్టం ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రెసెంట్ ఈమె పలు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్ కోసం వెతుక్కుంటుంది. ఈమె అందానికి పలు క్యారెక్టర్లు వచ్చినప్పటికీ వాటి ద్వారా ఈమెకి ప్రాధాన్యత లేదు అనుకోవడంతో వాటిని రిజక్ట్ చేస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ సిరీస్ యొక్క రెండవ సీజన్లో ఈ బ్యూటీ నటిస్తుంది. రానున్న రోజుల్లో స్టార్ హీరో సినిమాలలో చిన్న క్యారెక్టర్ అయినా నటించాలనేదే ఈమె కోరిక ఆట. మరి ఈమె కోరిక ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: