మణిరత్నం తీసిన రోజా సినిమా అంత ఈజీగా ఎలా మరిచిపోతాం. ఈ సినిమా అప్పట్లో తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో విడుదలై అఖండ విజయం సాధించింది. క్లాసిక్ ట్రెండ్ సెట్టర్‌గా మారిన ఈ సినిమాతో అరవింద్ స్వామి, మధుబాల మంచి పేరు తెచ్చుకున్నారు.ముఖ్యంగా మధుబాల తన అందం, నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. అయితే కెరీర్ మొత్తంలో ఆమె ఆరు భాషలలో నటించి ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకి దూరంగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు నటిగా అలరిస్తుంది. అయితే మధుబాల తాజాగా ఆ నాటి పరిస్థితులు ఎలా ఉండేవో చెప్పుకొచ్చింది. 90లలో నటీమణులు ఆరుబయట బట్టలు మార్చుకోవలసి వచ్చేది. ఆ సమయంలో ఎవరు చూస్తున్నారో తెలియదంటూ మధుబాల పేర్కొంది.అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు లేడీస్‌కి సౌకర్యాలు మరింత మెరుగుపడ్డాయి. నేను ఎర్ర గుహలలో, కొలాచిలో తమిళ చిత్రాల షూటింగులు చేస్తున్నప్పుడు ఆరుబయటే బట్టలు మార్చుకోవల్సి వచ్చేది. ఇక కొండ ప్రాంతాలు, చెట్ల క్రింద మరుగుదొడ్డిగా భావించే వాళ్లం. ఎంతో ఇబ్బందికరంగా ఉండేది. వేడిలో డ్యాన్స్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. బట్టలు మార్చుకోవడానికి పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు. ఇరువర్ షూటింగ్ సమయంలో తమిళనాడులోని ఒక మారుమూల ప్రదేశంలో షూటింగ్ జరుగుతుండగా, అక్కడ రెస్ట్ తీసుకునేందుకు ప్లేస్ లేకపోవడంతో రాళ్లపైనే నిద్రించానని పేర్కొంది మధుబాల.ఇప్పుడు అంత ఇబ్బంది లేదు. మనకు మేకప్ కోసం వ్యాన్ కావాలని అడగొచ్చు, గోప్యతకు అవకాశం ఉంది. అప్పుడు అంత డబ్బు సంపాదించిన కూడా ఏం లాభం. రాళ్ల మీద పడుకోవల్సి వచ్చేంది. మహిళా నటీమణులకి ఆ రోజుల్లో ఇబ్బందులు చాలా వర్ణనాతీతం అని చెప్పాలి. నా కోసం నేను కనుగొన్నది ఏమిటంటే.. నాకు స్టేజ్ ఉన్నా లేకపోయినా నటిని కాబ్టటి అలా ఎదగాడినికి ఎంతో ప్రయత్నిస్తుంటాను అని మధుబాల పేర్కొంది. శ్రేయాస్ తల్పాడేతో మధు నటించిన తాజా చిత్రం కర్మమ్ భుగ్తం ఇప్పుడు థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది. ఫూల్ ఔర్ కాంటే, రోజా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో అద్భుత పాత్రలతో మెప్పించిన మధూ ఇటీవల కంగనా రనౌత్‌తో 'తలైవి', సమంతా రూత్ ప్రభుతో 'శాకుంతలం' చిత్రాలలో కూడా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: