అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన 'పుష్ప 2: ది రూల్' చిత్రం ఇప్పటికే చాలా సంచలనం సృష్టిస్తోంది. ప్రారంభ సంగ్రహావలోకనం నుండి గత నెలలో విడుదలైన టీజర్, మాస్ పోస్టర్ల వరకు, ఈ చిత్రం దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ అవుతుందని హామీ ఇచ్చింది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప’ బాక్సాఫీస్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే.ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ సక్సెస్ అవ్వడంతో పాటూ అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు ను కూడా తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ ‘పుష్ప 2’ కోసం సినీ లవర్స్ తెగ ఎదురు చూస్తున్నారు. ఏడాదిగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది.మధ్యలో పుష్ప-2 గ్లింప్స్ ను విడుదల చేసిన సినిమా మీద మరింత హైప్ ను పెంచారు దర్శకుడు సుకుమార్. పార్ట్ వన్ కన్నా పార్ట 2 నెక్స్ట్ లెవల్ ఉంటుందని ఎప్పటి నుంచో ఊరిస్తున్నారుకూడా. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా తెరకెక్కుతోందని దర్శకుడు, నటులు కూడా చెబుతూ వస్తున్నారు. రీసెంట్ గా మ్యాజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ రిలీజ్ చేసిన సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.ఆగస్టు 15 న సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. ఆ మధ్య రిలీజ్ వాయిదా పడనుందని ఎన్నో రకాల రూమర్స్ వినిపించాయి. కానీ వాటిని కొట్టి పారేస్తూ మేకర్స్ చెప్పిన టైంకి సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చెబుతూ వస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ఆగస్టు 15 న రిలీజ్ కావడం లేదని ఓ షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది.ప్రముఖ బాలీవుడ్ సినీ క్రిటిక్ అమిత్ కరణ్ తాజాగా తమఇంస్టాలో ..” ‘పుష్ప 2’ రిలీజ్ పోస్ట్ పోన్ అయిందని, ఈ సినిమా ఆగస్టు 15 న రిలీజ్ కావడం లేదని, అందుకు కారణం షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న కారణంగా మేకర్స్ విడుదల తేదిని వెనక్కి నెట్టినట్లు” రాసుకొచ్చాడు. దీంతో ఆయన చేసిన పోస్ట్  నెట్టింట వైరల్ గా మారింది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: