అలు ఫ్యామిలీకి,  మెగా ఫ్యామిలీకి చెడిందా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో రోజుల నుంచి ఇదే విషయంపై చర్చ జరుగుతుంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీ లోని హీరోలు అందరూ హాజరయ్యే ఫంక్షన్లకు అల్లు అర్జున్ రాకపోవడం.. ఎప్పుడు సినిమా ఫంక్షన్ లో జరిగిన మామయ్య చిరంజీవినీ పొగడకుండా స్పీచ్ ముగించని అల్లు అర్జున్ ఇక ఇప్పుడు అలా చేయకపోవడం.. లాంటి కొన్ని సంఘటనలు మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు ఉన్నాయి అన్న వార్తలకు మరింత బలం చేకూర్చాయ్ అని చెప్పాలి.


 అయితే మొన్నటికి మొన్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి వార్తలు తెరమీదకి వచ్చాయి. ఎందుకంటే మెగా ఫ్యామిలీలోని హీరోలు అందరూ కూడా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్  గెలవాలని పిఠాపురం వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేవలం మెగా హీరోలు మాత్రమే కాదు టాలీవుడ్ లోని మిగతా హీరోలు డైరెక్టర్లు అందరూ కూడా పవన్ కి మద్దతుగా నిలబడ్డారు. ఇలాంటి సమయంలో మెగా హీరోగా పేరుందిన అల్లు అర్జున్ మాత్రం పవన్ కళ్యాణ్ కు కాకుండా తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థి శిల్ప రవికి  మద్దతుగా ప్రచార నిర్వహించేందుకు వెళ్లడం సంచలనంగా మారింది. ఇక ఈ ఘటన తర్వాత నాగబాబు అల్లు అర్జున్ ను ఉద్దేశిస్తూ సంచలన పోస్ట్ పెట్టారు.


 ఇలా జరుగుతున్న పరిణామాలు అన్ని అల్లు, మెగా ఫ్యామిలీకి మధ్య దూరాన్ని మరింత పెంచుతున్నాయి అన్నది అర్థమవుతుంది. ఇలాంటి సమయంలో ఇటీవల మెగా హీరో సాయిధరమ్ తేజ్ అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడం మరింత సంచలనంగా మారింది. అయితే ఇటీవల ఇదే విషయంపై ఒక ఇంటర్వ్యూలో నిహారికకు ప్రశ్న ఎదురైంది. కమిటీ కుర్రోళ్ళు టీజర్ లాంచ్ ఈవెంట్లో విలేకరులు నిహారికను ఇదే విషయంపై ప్రశ్నించారు. ఈ విషయంపై నిహారిక స్పందిస్తూ.. సాయి ధరంతేజ్, అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేసిన విషయం కూడా మీరు చెబితేనే నాకు తెలుసు. ఏది ఏమైనా ఎవరి కారణాలు వారికి ఉంటాయి అంటూ నిహారిక చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: