ఒకప్పుడు జబర్దస్త్‌లో కనిపించిన కమెడియన్లు అందరూ ఒక్కొక్కరిగా బయటికి వచ్చేసిన సంగతి తెలిసిందే. అలా వచ్చి ప్రస్తుతం సినిమాలు, ఇతర ఛానల్స్‌ లో షోలు చేస్తున్న వారిలో ముక్కు అవినాష్ ఒకరు. తాజాగా అవినాష్ 'దావత్' టాక్ షోకి గెస్టుగా వచ్చాడు. ఈ సందర్భంగా యాంకర్ రీతూ చౌదరి అడిగిన పలు ప్రశ్నలకి ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చాడు అవినాష్. ఇందులో భాగంగా జబర్దస్త్‌ను వీడి బిగ్‌బాస్‌కి వెళ్లిన నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.మల్లెమాల టీం జబర్దస్త్ ఆర్టిస్ట్‌ల మధ్య ఓ ఒప్పందం ఉంటుందన్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ ఆర్టిస్టులందరూ ఏం చేసినా ఆ అగ్రిమెంట్ ప్రకారమే చేయాల్సి ఉంటుందట. అందుకు నాగబాబు జబర్దస్త్‌ను వీడిపోయాక.. ఆయనతో పాటు వెళ్లేందుకు చాలా మంది సిద్దపడ్డారట. కానీ వారి కాళ్లను కట్టిపడేసింది ఈ అగ్రిమెంటేనని అప్పట్లో వార్తలు వచ్చాయి. మళ్లీ ఆ అగ్రిమెంట్ల గోల తాజాగా వార్తల్లో నిలిచింది. అందులో ఎంత నిజముందో ఎవ్వరికీ తెలియదు గానీ.. ఓ వార్త అయితే చక్కర్లు కొడుతోంది.జబర్దస్త్ అవినాష్ అలియాస్ ముక్కు అవినాస్..బిగ్‌బాస్ షోలో ఆలస్యంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చేశాడు. ఇలా ఆలస్యంగా రావడానికి కారణం మల్లెమాల టీమేనట. అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు చెల్లించాకే ఎక్కడికైనా వెళ్లాలని వారించారట. ఇక చేసేదేమీ లేక వారు చెప్పిన మొత్తాన్ని మల్లెమాలకు సమర్పించి.. చట్టబదంగా ఎలాంటి నిబంధనలు లేకుండా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడట.

బబర్దస్త్ కామెడీ షో ద్వారా అవినాశ్ చాలా పాపులర్ అయ్యారు. ఆ షోలో చాలా స్కిట్స్ చేశారు. ముక్కు అవినాశ్ పేరుతో ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత ఆ షోలో ఓ టీమ్ లీడర్ కూడా అయ్యారు.బిగ్‌బాస్ టీం కూడా ఆ విషయంలో కాస్త నిక్కచ్చిగా ఉందట. మల్లెమాల అగ్రిమెంట్ అడ్డురాకూడదని ముందే చెప్పారట. అందుకే బిగ్‌బాస్ ఇచ్చిన రెమ్యూనరేష్ కూడా భారీ స్థాయిలోనే ఉండటంతో.. అందులోంచే అటు సర్దేశాడట. మల్లెమాలకు దాదాపు పది లక్షలు ఇచ్చి అగ్రిమెంట్‌ను రద్దు చేసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే మల్లెమాల వారు స్పందించే వరకు ఆగాల్సిందే.ప్రస్తుతం స్టార్ మా ఛానల్‌లో షో ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్ బాధ్యతను మాత్రం ముక్కు అవినాష్‌ చూసుకుంటున్నాడు. శ్రీముఖి హోస్ట్ చేస్తున్న 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' నుంచి 'నీతోనే డ్యాన్స్ 2.0' వరకూ హడావిడి అంతా అవినాష్‌దే. ఇక ఫెస్టివల్ ఈవెంట్స్‌లో కూడా ఎంటర్‌టైన్ చేస్తూ అవినాష్ కనిపిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: