నటి పూర్ణ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంది. ఆమె పెళ్లి చేసుకుని తల్లి కూడా అయ్యింది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితమయ్యింది. మొన్నటి వరకు డాన్స్ షో ఢీ షోకి జడ్జ్ గా చేసింది. ఇప్పుడు దాన్ని కూడా వదిలేసింది.  ప్రస్తుతం ఆమె చేతిలో అయితే సినిమాలు లేవు. తాజాగా పూర్ణకి చెందిన ఓ విషయం ట్రెండింగ్‌లోకి వచ్చింది.నటి పూర్ణ.. సీమటపాకాయ్, అవును, అవును -2, రాజు గారి గది, జయమ్ము నిశ్చయమ్మురా,సిల్లీ ఫెలోస్ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన పూర్ణ హారర్ మూవీస్ ద్వారా ఫేమస్ అయ్యింది.ఈమెకి రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అవును,అవును 2 సినిమాలే గుర్తింపుని ఇచ్చాయి.అయితే అలాంటి పూర్ణ పెళ్లి చేసుకుని ఒక బాబుకు జన్మనిచ్చాక గుంటూరు కారం, భీమా,దసరా, అఖండ వంటి సినిమాల్లో కీలకపాత్రల్లో కూడా నటించింది. బుల్లితెర పై ఢీ జోడి లో జడ్జిగా చేసిన ఈ ముద్దుగుమ్మ తర్వాత ఈ షో కి రావడం కూడా మానేసింది. 

ప్రస్తుతం ఈ హీరోయిన్ కి సంబంధించిన సినీ అప్డేట్స్ కూడా ఏమీ లేవు.ఇదంతా పక్కన పెడితే చాలా మంది నటీనటులకు వారికి సంబంధించిన ఫస్ట్ లవ్,ఫస్ట్ క్రష్ అనేది ఉంటుంది. అయితే పూర్ణకి కూడా ఫస్ట్ లవ్ ఉందట.అది కూడా స్కూల్ డేస్ లోనే.. హీరోయిన్ పూర్ణ స్కూల్లో చదువుకుంటున్న సమయంలో అబ్బాయిని ప్రేమించిందట.ఇక ఆ లవ్ స్టోరీ ఏంటంటే.. గర్ల్స్ స్కూల్లో చదువుకున్న పూర్ణ స్కూల్ డేస్ లో లవ్ ఎలా పుట్టింది అని చాలా మంది అనుకుంటారు. అయితే ఈమె గర్ల్స్ స్కూల్లో చదువుకున్న సమయంలో ఆమె స్కూల్ కి సమీపంలో బాయ్స్ హై స్కూల్ కూడా ఉండేదట. అలా ఆమె బస్సులో వెళుతూ ఉండగా చిన్నపిల్లలను దింపడానికి బాయ్స్ స్కూల్ దగ్గర బస్సు ఆగిన సమయంలో ఒక అబ్బాయి నీ చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోయిందట పూర్ణ.అలా ఇద్దరికీ చూపులు కలిసాయట.కానీ మాట్లాడుకోలేదు.అలా కొద్ది రోజులు చూసుకుంటూ ఉన్నాక వాలెంటైన్స్ డే రోజు గులాబీ పువ్వుతో పాటు చాక్లెట్లు కూడా పంపించారట. కానీ సంవత్సరం పాటు చూసుకున్న ఈ జంట తమ లవ్ ని కంటిన్యూ చేయలేదట.. ఇక ఇదే తన ఫస్ట్ లవ్ అని పూర్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇక ఈ వీడియో చూసిన చాలా మంది జనాలు పూర్ణ ఫస్ట్ లవ్ సినిమా లెవల్ లో ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: