నాచురల్ స్టార్ నాని గత ఏడాది హాయ్ నాన్న సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాతో ఆమె కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఆ సినిమా తర్వాత నాచురల్ స్టార్ నాని చేస్తున్న లేటెస్ట్ సినిమా సరిపోదా శనివారం. వివేక ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతోంది. ఇకపోతే ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇకపోతే ఇందులో నానికి జోడిగా గ్యాంగ్ లీడర్ ఫేం

 ప్రియాంక మోహన్ హీరోయిన్ గా కనిపించబోతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు పాటలు గ్లిమ్స్ అన్ని సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. ఇకపోతే నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమాని ఆగస్టు 29న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన చేశారు. దీంతో ఎప్పుడు ఈ సినిమా వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నాచురల్ స్టార్ నాని అభిమానులు. అయితే ఈ సినిమా తర్వాత నాచురల్ స్టార్ నాని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లుగా తెలిపారు

  అంతేకాదు బడ్జెట్ కారణాల వల్ల ఆ సినిమా ప్రస్తుతం అలాగే ఉంది అని తెలుస్తోంది.  ఇదిలా ఉంటే నాని మరోసారి తనకి దసరా వంటి బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నారు.ఈ సినిమా నాని కెరీర్ లో 33 వ సినిమాగా తెరకెక్కుతుంది..దసరా సినిమాను నిర్మించిన సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దసరా సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ నే ఈ సినిమాలో తీసుకుంటారా లేక మరో హీరోయిన్ ను తీసుకుంటారా అనేది తెలియాల్సి వుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కీర్తిసురేష్ ,సాయి పల్లవి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.  వీరిద్దిరిలో ఎవరొకరిని మేకర్స్ ఫైనల్ చేయనున్నట్లు సమాచారం. అలా ప్రస్తుతానికి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: