జాన్వీ కపూర్ ఎలాంటి పాత్రైనా చేయగల నటి కాదు. అంటే ఆమె కొన్ని రకాల పాత్రలకే సరిపోతుంది. దర్శకులు అలాంటి క్యారెక్టర్లే ఆమెకు ఇవ్వడం ద్వారా ఆమెలోని యాక్టింగ్ స్కిల్స్ ను బాగా ఉపయోగించుకోవచ్చు. ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా ఉంటుంది, అవర్ గ్లాస్ ఫిగర్ ఆమెది. అలాగే మంచి డాన్సర్ కూడా. కానీ, బాలీవుడ్ సినిమాల్లో ఆమెకు ఎక్కువగా డీగ్లామరైజ్డ్ పాత్రలో నటింపజేశారు. సాధారణ అమ్మాయి పాత్రలు ఇస్తున్నారు. అలాంటి పాత్రలు యువతను గానీ, సినిమా ప్రేమికులకు గానీ ఆకట్టుకోలేవు. ఈ విషయాన్ని గుర్తించలేక బాలీవుడ్ డైరెక్టర్లు ఎప్పటిదాకా జాన్వీ నువ్వు నాశనం చేశారు అయితే కొరటాల శివ ఆమెను ఎలా చూపించవచ్చో బాలీవుడ్ డైరెక్టర్లకు చూపించాడు. ఇది వారికి ఒక చెంప దెబ్బ లాంటిది అని చెప్పుకోవచ్చు.
ఇప్పుడే జాన్వీ కపూర్ నిజంగా అందాల దేవత అని బాలీవుడ్ డైరెక్టర్లు ప్రేక్షకులు తెలుసుకుంటున్నారు. దేవర సినిమాలో ఆమె ఎంత అందమైనదో, ఎంత హాట్‌గా ఉంటుందో చూపించారు. ఆమె తొలి తెలుగు సినిమా 'దేవర'లోని ఒక రొమాంటిక్ సాంగ్ నిన్న రిలీజ్ అయ్యింది. ఆ సాంగ్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆ సాంగ్ లో జాన్వీ చాలా అందంగా, సెక్సీగా కనిపించింది. ఎన్టీఆర్ కంటే కూడా ఆమె గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. జాన్వీ కపూర్ సినిమాల్లోకి వచ్చి ఇప్పటికి ఆరున్నర సంవత్సరాలు అవుతుంది కానీ, ఇంతకు ముందు ఎప్పుడూ జాన్వీ చేసిన సినిమాలకు ఇలాంటి రెస్పాన్స్ రాలేదు.
జాన్వీ కపూర్ నిజ జీవితంలో చాలా అందంగా ఉంటుంది. కానీ సినిమాల్లో ఆమె పాత్రలు చాలా బోరింగ్‌గా ఉంటాయి. తెలుగు దర్శకుడు కొరటాల శివ మాత్రమే జాన్వీని తెరపై చాలా అందంగా చూపించాడు. బాలీవుడ్ వాళ్ళు తెలుగు సినిమా ఇండస్ట్రీని చూసి నటీనటుల ప్రతిభను బాగా ఉపయోగించుకోవడం ఎలానో నేర్చుకోవాలి. కొరటాల శివ జాన్వీని ఎంత చక్కగా చూపించగలమో అంత చక్కగా చూపించగలిగించేసాడు.