టాలీవుడ్ సెన్సేషన్ గా పేరు తెచ్చుకున్న శ్రీలీల నటించిన మొదటి రెండు మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇండస్ట్రీలో తిరుగులేకుండా పోయింది. అప్పటివరకు ఉన్న సీనియర్ హీరోయిన్లందరూ ఈమె ముందు తుడిచి పెట్టుకుపోయారు.వరుస అవకాశాలు చేజిక్కించుకుంది.అలా గత సంవత్సరం మొత్తం శ్రీలీలదే అన్నట్టుగా మారిపోయింది. కానీ గత సంవత్సరం శ్రీలీలకు అంతగా కలిసి రాలేదు. కేవలం భగవంత్ కేసరి సినిమా తప్ప మిగిలిన సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, స్కంద,ఆది కేశవ ఇలా ఈ సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. అయితే ఈ ఏడాది వచ్చిన గుంటూరు కారం సినిమా ఓకే టాక్ తెచ్చుకున్నప్పటికీ వావ్ అనిపించేలా మాత్రం లేదు.

 అయితే ప్రస్తుతం శ్రీ లీల పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే విజయ్ దేవరకొండ తో ఓ సినిమాలో నటిస్తోంది.ఇవే కాకుండా రీసెంట్ గా  రవితేజతో ధమాకా మూవీ తర్వాత మరో మూవీకి కూడా సైన్ చేసింది.అలా రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించి పూజ కార్యక్రమాలు జరిగాయి. అయితే ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఎంబిబిఎస్ పూర్తి చేసిన శ్రీ లీల బయటికి ఎక్కడికి వెళ్లినా కూడా తన హ్యాండ్ బ్యాగ్ లో కచ్చితంగా ఆ వస్తువును ఉంచుకుంటుందట. అయితే సినిమా షూటింగ్స్ కి వెళ్లినా లేదా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్లినా ఇంకేదైనా వెకేషన్ కి వెళ్ళినా సరే హ్యాండ్ బ్యాగ్ లో మేకప్ కిట్ లేకపోయినా సరే కానీ ఆ వస్తువుని మాత్రం కచ్చితంగా ఉంచుకుంటుందట.

ఇక సాధారణంగా అమ్మాయిలు ఎవరైనా సరే హ్యాండ్ బ్యాగ్ లో మేకప్ పౌడర్,లిప్స్టిక్, ఫోన్, ఇయర్ ఫోన్స్ వంటివి పెట్టుకుంటారు. కానీ శ్రీలీల వీరందరికీ చాలా భిన్నం. ఎందుకంటే శ్రీలీల బయటికి ఎక్కడికి వెళ్లినా కూడా తన బ్యాగులో కచ్చితంగా అమ్మవారికి సంబంధించిన కుంకుమను పెట్టుకుంటుందట. అయితే శ్రీలీలకు దైవభక్తి ఎక్కువ.అందుకే ఇంటి నుండి కాలు అడుగు బయట పెడితే తనకి అంతా శుభమే జరగాలని ఆ అమ్మవారి కుంకుమను ఎప్పుడు కూడా తన హ్యాండ్ బ్యాగ్ లో ఉంచుకుంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: