అసలు విషయంలోకి వెళ్తే.. నాచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం దసర. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల ఇండస్ట్రీకి డైరెక్టర్గా పరిచయమయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా విజయం సాధించడంతో మళ్లీ నానితోనే ది ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నారు శ్రీకాంత్ ఓదెల. ఇక తన తదుపరి చిత్రాన్ని చిరంజీవితో చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఒక సాలిడ్ స్క్రిప్ట్ వినిపించగా.. చిరంజీవి కూడా కథ నచ్చి ఓకే చెప్పారట. మరోవైపు చిరంజీవి బింబిసార సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు.
ఈ సినిమాను వచ్చే ఏడాది మే నెలలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఇటు చిరంజీవి విశ్వంభర, అటు శ్రీకాంత్ ఓదెల ది ప్యారడైజ్ చిత్రాల షూటింగ్ లు పూర్తయిన తర్వాతనే చిరంజీవి ,శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో ఏ జోనర్లో సినిమా రాబోతోంది అనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. మొత్తానికి అయితే వీరిద్దరి కాంబినేషన్లో ఎలాంటి కాన్సెప్ట్ తో సినిమా రాబోతోంది అని , అభిమానులు సైతం చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి