
జైలర్ చిత్రంలో కీలకమైన పాత్రలలో మోహన్ లాల్ ,శివరాజ్ కుమార్ వంటి వారు కూడా అద్భుతంగా నటించారు. అయితే ఆ తర్వాత జైలర్ 2 సినిమా ని ఇటీవలే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. టీజర్ కూడా విడుదల చేయగా బాగానే ఆకట్టుకుంది. ఇక జైలర్ సినిమాలో కనిపించిన వారే జైలర్ 2 లో కూడా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జైలర్ 2 మరింత ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అలాగే అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉండేలా అనిరుద్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
సంక్రాంతికి విడుదలైన టీజర్ లో అటు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్, అనిరుద్ కనిపించడం గమనార్హం. ఈ సినిమాలో మరింత వైలెన్స్ ఉండబోతుందంటూ టీజర్ లోనే చూపించారు. ఈ సినిమా షూటింగ్ మార్చి 10- 2025 చెన్నైలో గ్రాండ్గా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారట. మరి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా చెన్నైలో ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి రజనీకాంత్ ఈ సినిమాతో ఏ విధంగా మరొకసారి అభిమానులను ఆకట్టుకుంటారో చూడాలి మరి.