ప్రస్తుత పరిస్థితులలో పవన్ కళ్యాణ్ అన్ని రోజులు డేట్లు ఇచ్చేలా కూడా కనిపించడం లేదు. దీంతో ఓజి సినిమా ఈ ఏడాది ఉంటుందా ?లేదా అనే విషయం పైన కూడా అనుమానాలు మొదలవుతున్నాయి. అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఓటిటి డీల్ కూడా క్లోజ్ అయిందని ఓటిటి సంస్థ షెడ్యూల్ ప్రకారమే రిలీజ్ డేట్ ను కూడా లాక్ చేసుకున్నట్లు సమాచారం. అంటే ఈ సినిమా సెప్టెంబర్ లోపే రిలీజ్ అయ్యేలా చిత్ర బృందం చూడాలి. ఒకవేళ అప్పటిలో ఒక రిలీజ్ కాకపోతే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందట.
సెప్టెంబర్ తర్వాత రిలీజ్ ప్లాన్ చేసుకుంటే ఓటిటి నిబంధనల ప్రకారం నిర్మాత జేబులకు చిల్లుపడే అవకాశం ఉంటుందట. అందుకు అదనంగా నిర్మాతలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందట. ముఖ్యంగా ఓటీటి రిలీజ్ డేట్ ని ఓటిటి ప్లాట్ఫారం వారు ప్లాన్ చేసుకొని ఉంటారు ఒకవేళ వారు ఆ తేదీని కోల్పోతే నష్ట పోవాల్సి వస్తుందని ఆ సంస్థ భావిస్తున్నదట .ఈ నష్టం కూడా నిర్మాతల నెత్తిన భారంగా ఉంటుంది. అందుకే ఈ సినిమా నష్టాల నుంచి తప్పించుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఓజి సినిమా రిలీజ్ ని సెప్టెంబర్ లోపలే విడుదల చేయాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి