నందమూరి కళ్యాణ్ రామ్ ఆఖరుగా నటించిన ఐదు మూవీలకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ వివరాలను తెలుసుకుందాం.

కళ్యాణ్ రామ్ ఆఖరుగా డెవిల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ కి మొదటి రోజు 1.78 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

కళ్యాణ్ రామ్ కొంత కాలం క్రితం అమిగోస్ అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఈ మూవీ కి మొదటి రోజు 2.03 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

కళ్యాణ్ రామ్ కొంత కాలం క్రితం బింబిసారా అనే సినిమాలో హీరోగా నటించాడు. క్యాథరిన్ , సంయుక్త మీనన్ మూవీలో హీరోయిన్గా నటించగా ... మల్లాడి వశిష్ట ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ మూవీ కి మొదటి రోజు 6.30 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

కళ్యాణ్ రామ్ కొంత కాలం క్రితం ఎంత మంచి వాడవురా అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో మెహరీన్ హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ కి మొదటి రోజు 2.0 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

కళ్యాణ్ రామ్ కొంత కాలం క్రితం 118 అనే మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో శాలిని పాండే హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఈ మూవీ కి మొదటి రోజు 1.60 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

ఇక కళ్యాణ్ రామ్ తాజాగా అర్జున్ S/O వైజయంతి అనే సినిమాలో హీరోగా నటించాడు. ఆ మూవీ ఈ రోజు అనగా ఏప్రిల్ 18 వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీ కి మొదటి రోజు ఏ రేంజ్ కలెక్షన్లు వస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nkr