ఒకప్పుడు మల్టీ స్టారర్ సినిమాలు అంటే ఎక్కువగా ఆసక్తి ఉండకపోయేది.ఎందుకంటే అప్పటి స్టార్ హీరోలైనటువంటి ఎన్టీఆర్, ఏఎన్నార్,చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ,కృష్ణ,నాగార్జున వంటి హీరోలు ఎన్నో మల్టీస్టారర్ సినిమాలు చేసేవారు. ఆ సినిమాల్లో ఏ హీరో స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నా అభిమానులు అంతగా రియాక్ట్ అయ్యేవారు కాదు.కానీ ఇప్పటి జనరేషన్ లో మల్టీ స్టారర్ సినిమాలు అంటే చాలా కష్టంగా మారిపోయింది. తమ అభిమాన హీరోని ఆ సినిమాలో తక్కువ చేసి చూపిస్తే పెద్ద పెద్ద యుద్దాలే జరిగిపోతాయి. అయితే ఇప్పటి జనరేషన్లో మల్టీ స్టారర్ సినిమాలకు బీజం వేసింది వెంకటేష్, మహేష్ బాబు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరి కాంబోలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా ఇద్దరు హీరోల అభిమానులు కూడా సాటిస్ఫై అయ్యారు.

అయితే ఈ విషయం పక్కన పెడితే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కంటే ముందే బాలకృష్ణ, మహేష్ బాబులు ఇద్దరు అన్నదమ్ములుగా ఓ సినిమా తెరకెక్కించాలి అనుకున్నారట దర్శకుడు బి.గోపాల్.. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా జరిగినప్పటికీ ఎందుకో సినిమా కార్యరూపం దాల్చలేదు.అయితే దర్శకుడు బి.గోపాల్, బాలకృష్ణకి ఎన్నో హిట్ సినిమాలు అందించారు. పరమవీరచక్ర సినిమా మినహాయించి బాలకృష్ణ బి.గోపాల్ కాంబోలో వచ్చిన సినిమాలన్నీ ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమాలే. అలా బాలకృష్ణతో బి.గోపాల్ కి ఎంతో మంచి అనుబంధం ఉంది.అలాగే మహేష్ బాబు కూడా బి.గోపాల్ తో వంశీ మూవీ చేశారు. అయితే ఈ సినిమా హిట్ కాకపోయినప్పటికీ ఈ సినిమాతో మహేష్ బాబు వ్యక్తిగత జీవితంకి ఓ సంబంధం ఉంది.

ఎందుకంటే ఈ సినిమా సమయంలోనే మహేష్ బాబు నమ్రత ఇద్దరు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. అలా మహేష్ బాబు జీవితంలో వంశీ మూవీ ఎప్పటికీ మరిచిపోలేని సినిమానే.అయితే డైరెక్టర్ బి.గోపాల్ మహేష్ బాబు, బాలకృష్ణ ఇద్దరిని పెట్టి యాక్షన్, సెంటిమెంట్ రెండు కలగలిపిన ఓ సినిమా చేయాలి అనుకున్నారట. అలా సినిమాలో అన్నగా బాలకృష్ణ.. తమ్ముడుగా మహేష్ బాబుని చూపించాలి అనుకున్నారట. కానీ ఈ సినిమా స్క్రిప్ట్ రూపకల్పనలో మార్పులు, అప్పటి మార్కెట్ పరిస్థితులు, డేట్ల అడ్జస్ట్ మెంట్ కారణంగా వీరి కాంబోలో సినిమా తెరకెక్కలేకపోయింది. ఒకవేళ ఈ సినిమా తెరకెక్కితే గనుక మళ్లీ ఇప్పటి జనరేషన్లో మల్టీస్టారర్ సినిమాలకు బి.గోపాల్ పునాది వేసిన డైరెక్టర్ గా మిగిలిపోయేవారు.

మరింత సమాచారం తెలుసుకోండి: